వయనాడ్ లో పర్యటించనున్న రాహుల్ గాంధీ..!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వయనాడ్ పర్యటనకు వెళ్లనున్నారు.ఇందులో భాగంగా ఈనెల 12, 13 తేదీల్లో ఆయన పర్యటన కొనసాగనుందని తెలుస్తోంది.

లోక్ సభ సభ్యత్వం పునరుద్ధరణ తరువాత తొలిసారి రాహుల్ గాంధీ వయనాడ్ కు వెళ్లనున్నారని సమాచారం.ఇటీవలే అనర్హత వేటు పడిన తరువాత సోదరి ప్రియాంక గాంధీతో కలిసి రాహుల్ పర్యటించిన సంగతి తెలిసిందే.

కాగా పరువునష్టం కేసులో భాగంగా ఎంపీగా అనర్హత వేటుకు గురైన రాహుల్ ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు అనంతరం లోక్ సభ సభ్యత్వం పునరుద్ధరించబడిన సంగతి తెలిసిందే.

ఈ హోమ్ మేడ్ నైట్ క్రీమ్ తో మీ స్కిన్ బ్రైట్ అవ్వడం ఖాయం!
Advertisement

తాజా వార్తలు