Rahul Dravid : కేఎస్ భరత్, ఇషాన్ కిషన్ క్రికెట్ కెరీర్ పై రాహుల్ ద్రావిడ్ కీలక వ్యాఖ్యలు..!

భారత్ వేదికగా భారత్ వర్సెస్ ఇంగ్లాండ్( India vs England ) మధ్య ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భాగంగా రెండవ టెస్ట్ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఉప్పల్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో ఓటమిని చవిచూసిన భారత్, వైజాగ్ వేదికగా జరిగిన రెండవ మ్యాచ్లో గొప్పగా పుంజుకుని 1-1తో సిరీస్ ను భారత్ సమం చేసింది.

భారత జట్టు పుంజుకుని విజయం సాధించింది కానీ భారత జట్టు లో కొన్ని లోపాలు స్పష్టంగా కనిపించాయి.ఈ సిరీస్ లో కెప్టెన్ రోహిత్ శర్మ తో పాటు శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్ పరుగులు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారు.

Rahul Dravid Key Comments On Cricketers Ks Bharat Ishan Kishan

కేఎస్ భరత్( KS Bharat ) తన సొంత గడ్డపై జరిగిన వైజాగ్ టెస్టులో అద్భుతంగా ఆడుతాడు అనుకుంటే చివరికి నిరాశే మిగిల్చాడు.ఇప్పటివరకు ఏడు టెస్ట్ మ్యాచ్లు ఆడిన కేఎస్ భరత్ ఆకట్టుకునే ప్రదర్శన మాత్రం చేయలేకపోయాడు.ఇక వికెట్ కీపర్ గా ప్రత్యర్థి బ్యాటర్ లను అవుట్ చేసే అవకాశాన్ని కొన్నిసార్లు మిస్ చేశాడు.

మరికొన్ని సార్లు అద్భుతంగా కీపింగ్ చేశాడు.దీంతో కేఎస్ భరత్ పై వేటుపడే అవకాశం ఉంది.

Advertisement
Rahul Dravid Key Comments On Cricketers Ks Bharat Ishan Kishan-Rahul Dravid : �

అయితే కేఎస్ భరత్ కు భారత జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్( Rahul Dravid ) మద్దతు ఇచ్చాడు.వైజాగ్ టెస్టులో వికెట్ కీపర్ గా భరత్ మంచి ప్రదర్శన చేశాడు.

Rahul Dravid Key Comments On Cricketers Ks Bharat Ishan Kishan

ఇక ఇషాన్ కిషన్( Ishan Kishan ) గురించి మాట్లాడుతూ.తమకు టచ్ లోనే ఉన్నాడని, ప్రస్తుతం విరామం తీసుకుంటున్నాడని రాహుల్ ద్రావిడ్ తెలిపాడు.ఇషాన్ కిషన్ క్రికెట్ జట్టులోకి రావాలని తాను అనుకుంటున్నట్లు అది అతని చేతుల్లోనే ఉందని రాహుల్ ద్రావిడ్ పేర్కొన్నాడు.

శుబ్ మన్ గిల్ తిరిగి ఫామ్ లోకి రావడం చాలా సంతోషంగా ఉందని, గిల్ కు మూడు ఫార్మాట్లలో అద్భుత ఆట ప్రదర్శన చేసే సత్తా ఉందని చెప్పాడు.భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మరో మూడు టెస్ట్ మ్యాచ్లు ఆడే భారత జట్టును ఇంకా ప్రకటించలేదు.

చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!
Advertisement

తాజా వార్తలు