మ‌ధుమేహుల‌కు బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ ఇది.. వారంలో 3 సార్లు తీసుకున్నా మ‌స్తు బెనిఫిట్స్‌!

మ‌ధుమేహం.ప్ర‌స్తుత రోజుల్లో ఎవ‌రి ఆరోగ్యం గురించి క‌దిలించినా ఈ మాటే మొద‌ట‌ వినిపిస్తోంది.

ఒక‌ప్పుడు అర‌వై ఏళ్లు పైబ‌డిన వారిలో మ‌ధుమేహం వ్యాధి త‌లెత్తేది.కానీ, ఇప్పుడు వ‌య‌సుతో సంబంధం లేకుండా కోట్లాది మంది మ‌ధుమేహానికి బాధితులుగా మారుతున్నారు.

కార‌ణం ఏదైనా మ‌ధుమేహం ఉన్న వారు నోటిని త‌ప్ప‌కుండా అదుపులో పెట్టుకోవాలి.అలాగే ఆరోగ్యం ప‌ట్ట ప్రత్యేక శ్ర‌ద్ధ వ‌హించాలి.

ఇక‌పోతే మ‌ధుమేహం ఉన్న‌వారు ఉద‌యం బ్రేక్ ఫాస్ట్‌గా క‌డుపును నింపుకోవ‌డం కోసం ఏదో ఒక‌టి లాగించేస్తుంటారు.కానీ, మ‌ధుమేహుల‌కు బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ ఏంటీ అంటే.

Advertisement

చాలానే ఉన్నాయి.అందులో ఒక‌టి రాగి ఇడ్లీ.

అలా అని రోజూ రాగి ఇడ్లీ తీసుకోన‌క్క‌ర్లేదు.వారంలో మూడు సార్లు తీసుకున్నా మ‌స్తు హెల్త్ బెనిఫిట్స్‌ను త‌మ సొంతం చేసుకోవ‌చ్చు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.

మ‌ధుమేహుల‌కు రాగి ఇడ్లీ చ‌క్క‌టి ఆహారంగా చెప్పుకోవ‌చ్చు.ఉద‌యం బ్రేక్ ఫాస్ట్‌లో రాగి ఇడ్లీని తీసుకుంటే.అందులో ఉండే ప‌లు పోష‌కాలు మధుమేహం వ్యాధి గ్రస్తుల‌లో చక్కర స్థాయిల‌ను స‌మ‌ర్థ‌వంతంగా నియంత్రించడానికి సహాయపడ‌తాయి.

పవన్ కళ్యాణ్ మరో యోగి ఆదిత్యనాథ్.. సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణవంశీ!
చిరంజీవికి నాగబాబు కంటే పవన్ పైనే ప్రేమ ఎక్కువట.. అందుకు కారణాలివే!

అలాగే సాధార‌ణ వ్య‌క్తుల‌తో పోలిస్తే మ‌ధుమేహం ఉన్న వారికి గుండె పోటు వ‌చ్చే రిస్క్ కాస్త ఎక్కువ‌.అయితే ఆ రిస్క్‌ను త‌గ్గించ‌డంలో రాగి ఇడ్లీ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

Advertisement

రాగి ఇడ్లీని తీసుకుంటే ర‌క్తంలో బ్యాడ్‌ కొలెస్ట్రాల్ క‌రిగిపోయి.మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

త‌ద్వారా గుండె పోటే కాదు ఇత‌ర గుండె సంబంధిత జ‌బ్బులు సైతం ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.అంతేకాదు, రాగి ఇడ్లీని తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారు.

ర‌క్త‌హీన‌త ద‌రి చేర‌కుండా ఉంటుంది.జీర్ణ వ్య‌వ‌స్థ చురుగ్గా మారుతుంది.

మ‌రియు ర‌క్త‌పోటు కూడా అదుపులో ఉంటుంది.

తాజా వార్తలు