కేంద్ర పెద్దలకు లెటర్ రాసిన రఘురామకృష్ణంరాజు కొడుకు..!!

పార్లమెంటు సభ్యుడిగా ఉన్న తన తండ్రి రఘురామకృష్ణంరాజు ఏపి సిఐడి ప్రవీణ్ కుమార్ నాయక్ సారధ్యంలో పోలీసులు అమర్యాదగా ప్రవర్తించారని హక్కులకు భంగం కలిగించేలా అరెస్టు చేశారని పేర్కొన్నారు.

తండ్రిని అరెస్టు చేసే సమయంలో కనీస నిబంధనలు కూడా పాటించకుండా.

నోటీసులు కూడా ఇవ్వకుండా ఏపీ సిఐడి పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరించినట్లు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాకు లెటర్ రాశారు.అరెస్టు చేయడం మాత్రమే కాక కనీసం నడవ లేకుండా కొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Raghuram Krishna Raju Son Wrote A Letter To The Central Leaders, Raghuram Krishn

ఈ విషయంలో ఇప్పటికే  న్యాయ పోరాటం చేస్తున్నట్లు స్పష్టం చేశారు.తన తండ్రిపై కక్ష సాధింపు చర్యలకు ఏపీ పోలీసులు పాల్పడుతున్నట్లు .ఈ విషయాన్ని ఇప్పటికే కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్లు రఘురామకృష్ణం రాజు కొడుకు భరత్ లెటర్ లో స్పష్టం చేశారు.పార్లమెంటు సభ్యుడిగా ఉన్న తన తండ్రికి రాజ్యాంగం కల్పించిన హక్కులను.

భంగం కలిగించే రీతిలో వ్యవహరించారని లెటర్లో పేర్కొని ఎఫ్ఐఆర్ కాపీ తో పాటు తన తండ్రి కాలికి అయినా గాయాల ఫోటోలను కేంద్ర హోంశాఖ కార్యదర్శి భల్లా దృష్టికి తీసుకొచ్చారు.ఇదే క్రమంలో రఘురామ కృష్ణంరాజు తరపు న్యాయవాదులు బెయిల్ కోసం సుప్రీం కోర్టు ని ఆశ్రయించడానికి రెడీ అవుతున్నారు.

Advertisement

ప్రత్యేక లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని ఆలోచన చేస్తున్నారు.  .

Advertisement

తాజా వార్తలు