143వ భారతీయుడిగా రికార్డ్ క్రియేట్ చేసిన ఎన్నారై..

దుబాయ్ లో ఉండే భారతీయులకి అదృష్టం ఎప్పటికప్పుడు లాటరీల రూపంలో వరిస్తూనే ఉంటుంది.అందుకు ఉదాహరణే ఈ సంఘటన.

ఒమెన్ లో ఉండే ఓ ప్రవాస భారతీయుడు దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిల్లియనీర్ లాటరీ కొనుగోలు చేశాడు.అయితే తాజాగా జరిగిన డ్రాలో భారీ స్థాయిలో జాక్‌పాట్ కొట్టాడు.

దాంతో మిలియన్ డాలర్లు బహుమతిగా గెలుచుకున్నారు.ఇంతకీ ఆ పెద్ద మొత్తం ఎంతో తెలుసా దాదాపు 6,94,55000.

ఆ మొత్తం గెలుచుకున్న ఎన్నారై పేరు రఘు కృష్ణమూర్తి.ఈ వ్యక్తికి ఈ భారీ లాటరీ తగిలింది.301 సిరీస్‌లో 2115 నెంబర్‌ టిక్కెట్టు కొన్న ఆయనకీ ఈ భారీ లాటరీ తగలడంతో ఉబ్బితబ్బిబ్బై పోతున్నారు.అంతేకాదు వరుసగా ఇలా దుబాయి లాటరీ గెలుచుకున్న 143వ భారతీయుడిగా ఆయన రికార్డ్ సృష్టించాడు.

Advertisement

అంతేకాదు దుబాయ్ లో ఉండే మరి కొంతమంది భారతీయులు కూడా మరిన్ని బహుమతులు గెలుపొందారు.వారిలో ఒకరికి బిఎండబ్ల్యూ దక్కగా మరొకరికి మోటార్ బైక్స్ దక్కాయి.

శ్రీనివాస్ కరిరాం బిఎండబ్ల్యూ ఆర్ నైన్‌టీ రేసర్ బైక్ గెలుచుకోగా మహరూఫ్ అనే వ్యక్తి కారుని సొంతం చేసుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు