హీరోయిన్ రాగానే మొహం చూడను.. అదే చూస్తాను.. రాఘవేంద్రరావు కామెంట్స్ వైరల్!

టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలోని దర్శకులలో రాఘవేంద్రరావు ( Raghavendra Rao )ప్రత్యేకం అనే సంగతి తెలిసిందే.

హీరోయిన్లను అందంగా చూపించే విషయంలో ఈ దర్శకునికి ఎవరూ సాటిరారని అప్పట్లో కామెంట్లు వినిపించేవి.

ఈ డైరెక్టర్ డైరెక్షన్ కు దూరంగా ఉన్నా ఇంటర్వ్యూలు ఇస్తూ ఆ ఇంటర్వ్యూల ద్వారా ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు.ఒక ఇంటర్వ్యూలో రాఘవేంద్రరావు మాట్లాడుతూ హీరోయిన్ రాగే మొహం చూడనని అన్నారు.

వయస్సులో ఉన్న అమ్మాయిలందరూ అందంగా ఉంటారు అని ఆయన తెలిపారు.కొంతమంది కళ్లు అందంగా ఉంటాయని కొంతమంది నవ్వు అందం అంటుందని కొంతమంది నడక అందంగా ఉంటుందని కొంతమంది షేప్ అందంగా ఉంటుందని కొంతమంది ఆంగికం అందంగా ఉంటుందని రాఘవేంద్రరావు కామెంట్లు చేశారు.

రాజమౌళి ( Rajamouli )ఒక సందర్భంలో మీరు చూపించినంత అందంగా మేము హీరోయిన్లను అందంగా చూపించలేకపోతున్నామని అన్నాడని చెప్పుకొచ్చారు.

Advertisement

ఆ సమయంలో నేను హీరోయిన్ రాగానే మొహం చూడనని చెప్పగా అందరూ నవ్వారని ఆయన తెలిపారు.ఎంటర్టైన్ చేయడం కోసం ఆ మాట అన్నానని ఆయన చెప్పుకొచ్చారు.హైట్, నడుము, షేప్, బాడీ స్ట్రక్చర్ ద్వారా ప్లస్ పాయింట్లపై ఫోకస్ పెట్టి హీరోయిన్లను( Heroines ) అందంగా చూపిస్తున్నానని రాఘవేంద్రరావు కామెంట్లు చేశారు.

అందంగా ఉన్నా అందాన్ని చూపించకపోతే సినిమా వేస్ట్ అని ఆయన పేర్కొన్నారు.

సినిమా హిట్టైతే హీరోయిన్ హిట్ అవుతుందని రాఘవేంద్రరావు అన్నారు.హీరోకు అయినా హీరోయిన్ కు అయినా సినిమా హిట్ అయితే రేసులో ఉన్నట్టు లెక్క అని రాఘవేంద్రరావు తెలిపారు.ఎవరినైనా అందంగా చూపించగలననే నమ్మకం నాకు ఉందని ఆయన చెప్పుకొచ్చారు.

రాఘవేంద్ర రావు వయస్సు 81 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే.రాఘవేంద్రరావు కామెంట్లను కొంతమంది సమర్థిస్తుంటే మరి కొందరు విమర్శిస్తున్నారు.

ఆరోగ్యానికి సమోసా మంచిదా? బర్గర్ మంచిదా?.. అధ్యయనంలో తేలిందిదే...

ఎంతోమంది హీరోయిన్లు రాఘవేంద్రరావును ఎంతో అభిమానిస్తారనే సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు