శ్రీరెడ్డి వ్యాఖ్యలపై లారెన్స్‌ రెస్పాన్స్‌.. తెలిస్తే షాక్‌ అవుతారు

టాలీవుడ్‌ సెలబ్రెటీలపై గత కొన్ని రోజులుగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న శ్రీరెడ్డి తన విమర్శలను కొనసాగిస్తూనే ఉంది.

తాజాగా తమిళ స్టార్స్‌పై ఈ అమ్మడు చేస్తున్న విమర్శలు ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్నాయి.

తమిళ దర్శకుడు మురుగదాస్‌ మరియు హీరో శ్రీకాంత్‌లపై సంచలన ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి తెలుగు మరియు తమిళంలో దర్శకుడిగా మంచి గుర్తింపు ఉన్న లారెన్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే.తనకు అవకాశాలు ఇప్పిస్తాను అంటూ హామీ ఇవ్వడంతో కొన్నాళ్ల పాటు లారెన్స్‌తో ఫ్రెండ్‌షిప్‌ చేశాను అంటూ చెప్పుకొచ్చింది.

లారెన్స్‌ తనకు హెల్ప్‌ చేస్తాడని భావించాను, కాని నాకు బెల్లంకొండ సురేష్‌ విలన్‌గా మారాడు అంటూ శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది.ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళ సినిమా ఇండస్ట్రీని కూడా కుదిపేస్తున్నాయి.

లారెన్స్‌ను ఇప్పటి వరకు చాలా గౌరవంగా చూసిన అభిమానులు మరియు ప్రేక్షకులు ఆయనపై కాస్త అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.ఈ సమయంలోనే లారెన్స్‌ సన్నిహితుల వద్ద శ్రీరెడ్డి వ్యాఖ్యలపై స్పందించినట్లుగా తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Advertisement
Raghava Lawrence React On Sri Reddy Comments-శ్రీరెడ్డి వ
Raghava Lawrence React On Sri Reddy Comments

ఒక తమిళ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం.శ్రీరెడ్డి వ్యాఖ్యలపై లారెన్స్‌ స్పందించాడు.తాను తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో చిత్రాల్లో నటించాను, పలు చిత్రాలకు దర్శకత్వం వహించాను, ఎంతో మంది హీరోయిన్స్‌కు మరియు నటీనటులకు లైఫ్‌ ఇచ్చాను, కాని శ్రీరెడ్డి మాత్రం తనకు తెలియదు అంటూ చెప్పుకొచ్చాడట.

శ్రీరెడ్డి తనతో కొన్నాళ్ల పాటు ఫ్రెడ్‌షిప్‌ చేసినట్లుగా చెబుతున్న విషయంపై కూడా ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.తాను ఎలాంటి వాడినో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అని, తన వల్ల ఏ ఒక్క ఆడపిల్లకు ఇబ్బంది కలగకూడదు అనుకునే స్వభావం తనది అని, ఎప్పుడు కూడా తాను అవకాశాలను ఎర చూపి, ఇతరులను వాడుకోలేదు, వాడుకోను అంటూ చెప్పుకొచ్చాడు.

లారెన్స్‌పై శ్రీరెడ్డి చేసిన విమర్శలు ప్రస్తుతం టాలీవుడ్‌లో కూడా చర్చనీయాంశం అవుతుంది.గత కొంత కాలంగా సోషల్‌ మీడియాలో శ్రీరెడ్డి చేస్తున్న విమర్శలకు ఎక్ట్రానిక్‌ మీడియా ప్రచారంను కల్పించడం లేదు.

అందుకే ఆమె వ్యాఖ్యలు అందరికి చేరువ కావడం లేదు.అందుకే ఈ విషయమై ఎక్కువగా చర్చ అవసరం లేదని, చర్చ జరపడం వల్ల ఎక్కువ మందికి తెలిసే అవకాశం ఉంది తప్ప, మరే ఉపయోగం ఉండదు అని, ఆమెపై చర్యలు తీసుకోవాలని కూడా ఏ ఒక్కరు కోరుకోవడం లేదు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగస్టు 25, బుధవారం, 2021

మొత్తానికి శ్రీరెడ్డి తెలుగు సినిమా పరిశ్రమతో పాటు తమిళ సినీ పరిశ్రమను కూడా షేక్‌ చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు