Chandramukhi 2 : చంద్రముఖి2 కథ లీక్ చేసేశారుగా.. ఈ సినిమాలో థ్రిల్ చేసే అసలు ట్విస్టు ఇదేనంటూ? 

దాదాపు 15 సంవత్సరాల క్రితం పి.వాసు( P.Vasu ) దర్శకత్వంలో రజనీకాంత్( Rajinikanth ) నయనతార ప్రభు, జ్యోతిక వంటి వారు ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం చంద్రముఖి ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే.

ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం ద్వారా దర్శక నిర్మాతలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

అయితే ఈ సినిమాలో రజనీకాంత్ స్థానంలో లారెన్స్( Lawrence ) నటిస్తున్నారు.అలాగే జ్యోతిక స్థానంలో బాలీవుడ్ నటి కంగనా ( Kangana ) నటిస్తున్నారు.

ఈ సినిమా సెప్టెంబర్ 15వ తేదీన విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.ఇక ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.ఈ క్రమంలోనే చిత్ర బృందం తాజాగా ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు.

ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా కంగనా లారెన్స్ ఇద్దరు కూడా ఈ సినిమా స్టోరీ మొత్తం లీక్ చేసేసారు.ఇక వీరిద్దరి మాటలను బట్టి చూస్తే ఈ సినిమాలో హైలెట్ అయ్యే పాయింట్ చిన్న క్లూ ద్వారా బయటపడిపోయింది.

Advertisement

చంద్రముఖి( Chandramukhi ) సినిమాలో జ్యోతిక ( Jyothika ) ప్రధాన పాత్రలో నటించలేదు కేవలం ఆమె శరీరంలోకి చంద్రముఖి ఆవహించినప్పుడు మాత్రమే తాను నాట్యం చేస్తూ, రాజు పై ప్రతీకారం తీర్చుకునే లాగా కనిపిస్తుంది.కానీ సీక్వెల్స్ సినిమాలో మాత్రం అసలైన చంద్రముఖిని చూపించబోతున్నారని ఆ అసలైన చంద్రముఖినే కంగనా అంటూ వీరి మాటలు బట్టి తెలిసిపోయింది.కనిపించని దెయ్యంగానే అంత భయపెడితే ఇప్పుడు ఏకంగా నిజంగానే బంగాళాకు వస్తే జరగబోయే పరిణామాల నేపథ్యంలో కొనసాగింపుగా ఈ సినిమా సీక్వెల్ చిత్రం ఉండబోతుందని తెలుస్తోంది.

మరి ఈ సినిమా కూడా చంద్రముఖి స్థాయిలోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా లేక రజనీకాంత్ సినిమాని ముందుకు నడిపించినంతగా లారెన్స్ ఈ సినిమాని ముందుకు నడిపిస్తారా లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు