రాధేశ్యామ్ ఫ్లాప్ తో ప్రభాస్ సంచలన నిర్ణయం.. ఆ విషయంలో వెనుకడుగు వేస్తూ?

ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమా డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు భారీ మొత్తంలో నష్టాలు రావడంతో ప్రభాస్ తన పారితోషికంలో ఎక్కువ మొత్తం త్యాగం చేశారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

అయితే రాధేశ్యామ్ ఫ్లాప్ తో ప్రభాస్ సంచలన నిర్ణయం తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.ఇంతకాలం తన రెమ్యునరేషన్ రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసిన ప్రభాస్ ప్రస్తుతం తన నిర్ణయాన్ని మార్చుకుంటున్నారని తెలుస్తోంది.

ప్రభాస్ కు హైదరాబాద్ లో రెండు ఎకరాలలో పెద్ద స్థలం ఉంది.ఆ స్థలంలో ఫామ్ హౌజ్ నిర్మించాలని భావించిన ప్రభాస్ ఆ నిర్ణయం విషయంలో వెనక్కు తగ్గారని సమాచారం అందుతోంది.

వర్క్ స్టార్ట్ అయ్యే సమయంలో ప్రభాస్ ఫామ్ హౌస్ ఆలోచనను విరమించుకున్నారని బోగట్టా.

Advertisement

కొన్నిరోజుల క్రితం ప్రభాస్ చెన్నైలో ఒక ఖరీదైన బంగ్లాను కొనుగోలు చేయాలని ప్రభాస్ భావించారు.అయితే ఈ నిర్ణయం విషయంలో కూడా ప్రభాస్ వెనక్కు తగ్గారని తెలుస్తోంది.రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టడానికి ప్రభాస్ అస్సలు ఆసక్తి చూపడం లేదని రాధేశ్యామ్ సినిమా ఫలితమే ఇందుకు కారణమని సమాచారం అందుతోంది.

కొంతకాలం పాటు ఇన్వెస్ట్ మెంట్లకు ప్రభాస్ దూరంగా ఉండనున్నారు.ప్రభాస్ తర్వాత సినిమాలతో విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ప్రభాస్ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నా ప్రభాస్ కు క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు.

సలార్ సినిమాతో ప్రభాస్ విమర్శలు చేసేవాళ్లకు సరైన సమాధానం చెబుతారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.సలార్ మూవీ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ప్రభాస్ కు జోడీగా ఈ సినిమాలో శృతి హాసన్ నటిస్తున్నారు.

సెక్స్ కోసం మహిళలు వయాగ్ర వాడాల్సిన పని లేదు
Advertisement