పవన్ తో అరగంట పాటు చర్చించిన వంగవీటి రాధా కారణం

టీడీపీ నేత వంగవీటి రాధా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయినట్లు తెలుస్తుంది.

సరిగ్గా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ పార్టీ లో ఉన్న వంగవీటి రాధా ఉద్వేగం తో మాట్లాడుతూ నాకు గౌరవం లేని చోట నేను పనిచేయను,నన్ను శాసించే హక్కు ఎవరికీ లేదు అంటూ వ్యాఖ్యలు చేసి టీడీపీ పార్టీ లో చేరిన సంగతి తెలిసిందే.

తొలిగా కాంగ్రెస్ లో ఉన్న రాధా,ఆతరువాత ప్రజారాజ్యం పార్టీ అనంతరం వైసీపీ పార్టీ లలో చేరిన సంగతి తెలిసిందే.తోలి నుంచి కూడా టీడీపీ పార్టీ ఫై వ్యతిరేకత తో ఉన్న వంగవీటి కుటుంబం ఎన్నికల సమయంలో వైసీపీ పార్టీ కి గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించినప్పుడు అందరూ కూడా జనసేన పార్టీ లో చేరతారు అని భావించారు.

కానీ రాధా మాత్రం అనూహ్యంగా మా నాన్న ఆశయాల కోసం టీడీపీ లో చేరుతున్నట్లు తెలిపారు.మా నాన్న ఆశయాలు తీర్చే ఏ పార్టీ అయినా ప్రజల కోసం నేను ఆ పార్టీ కి అండగా ఉంటాను అంటూ రాధా మీడియా ముఖంగా ప్రకటించారు.

అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ కేవలం 23 సీట్ల తోనే సరిపెట్టుకొని ఘోర విఫలం కావడం తో ఇప్పుడు జనసేన అధినేత పవన్ తో భేటీ అయ్యారు.అరగంట పాటు వంగవీటి రాధా పవన్ కల్యాణ్ తో చర్చించినట్లు తెలుస్తుంది.

Advertisement

త్వరలో వంగవీటి రాధా జనసేన పార్టీలో చేరే అవకాశమున్నట్లు సమాచారం.

Lorem Ipsum Dolor Sit Amet
Advertisement