భారీ అంచనాలతో వచ్చిన రాయన్ ప్లాప్ అయింది.. మరి ధనుష్ పరిస్థితి ఏంటి..?

తమిళ్ సినిమా ఇండస్ట్రీ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరో ధనుష్( Dhanush ).ప్రస్తుతం ఈయన వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

ఇక ఆయన్ని స్వీయ డైరెక్షన్ లో చేసిన రాయన్ సినిమా( Raayan ) రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని అందుకుంటానని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నప్పటికీ ఈ సినిమా మీద అటు తమిళం లో గాని, ఇటు తెలుగులో గాని నెగిటివ్ టాక్ అయితే వచ్చింది.

కాబట్టి ఈ సినిమాతో ధనుష్ చాలావరకు ఇబ్బందుల్లో పడ్డడానే చెప్పాలి.

,raayan Movie Came With Huge Expectations, Flopped And What Is Dhanushs Condit

ఇంకా మొత్తానికైతే ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలనే ప్రయత్నం అయితే చేసినప్పటికీ అది వర్కౌట్ కాలేదు.ఇక దాంతో తను తర్వాత చేయబోయే సినిమాల మీద ఎక్కువ దృష్టి సారించడానికి ప్రయత్నం చేస్తున్నాడు.ఇక ఇప్పుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో చేస్తున్న కుబేర సినిమా( Kubera ) మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.

Advertisement
,Raayan Movie Came With Huge Expectations, Flopped And What Is Dhanush's Condit

మరి ఆ సినిమాతో తెలుగులో మరోసారి తన సత్తా చాటుకోవాలని ప్రయత్నంలో ఉన్నాడు.సార్ సినిమా సక్సెస్ తర్వాత వచ్చిన కెప్టెన్ మిల్లర్ సినిమా ఫ్లాప్ అయింది.

ఇక ఇప్పుడు వచ్చిన రాయన్ సినిమా కూడా ప్లాప్ అయింది.ఇప్పుడు కుబేర సినిమాతో సక్సెస్ సాధిస్తేనే ధనుష్ అనుకున్నట్టుగా తెలుగు మార్కెట్ భారీ గా పెరుగుతుంది.

,raayan Movie Came With Huge Expectations, Flopped And What Is Dhanushs Condit

లేకపోతే మాత్రం ఆయన తెలుగు మార్కెట్ అనేది మరింత డల్ అయిపోతుందనే చెప్పాలి.అయితే ధనుష్ తనదైన రీతిలో సినిమాను చేసి సక్సెస్ ఫుల్ గా నిలిపే ప్రయత్నం అయితే చేశాడు.కానీ కథలో చాలావరకు మిస్టేక్స్ ఉండడం వల్లే రాయన్ సినిమా భారీగా డిజాస్టర్ అయింది.

మరి ఈ సినిమాతో దక్కిన పరాభవాన్ని తర్వాత సినిమాతో భర్తీ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు
Advertisement

తాజా వార్తలు