బికినిలో రెచ్చిపోయినా రాశీఖన్నా

బొద్దుగుమ్మ రాశీఖన్నాను మొదటి చిత్రం "ఊహాలు గుసగుసలాడే" లో చూడగానే, చూడచక్కగా చకనమ్మలా ఉంది అనుకున్నారంతా.

కాని నేను మరీ అంత సాఫ్ట్ కాదు అని రెండోవ చిత్రం జోరులో తేల్చి చెప్పింది ఈ భామ.మంచి గ్లామర్ షో చేసి నేను కమర్షియల్‌ హీరోయిన్ ని అనే సంకేతాలు పంపింది.ఆ సినిమా అంతగా ఆడకపోయినా, సినిజనాల దృష్టిలో పడింది.

ఇక గోపిచంద్ జిల్ లో మరింత అందంగా, మరింత గ్లామరస్ గా కనిపించి కనువిందు చేసింది.అయితే ఇప్పటిదాకా ఒక ఎత్తు, ఇప్పుడు బెంగాల్ టైగర్ లో ఒక ఎత్తు అంట.రవితేజ బెంగాల్ టైగర్ లో రాశీ అందాల ప్రదర్శన ముందు తమన్నా కూడా చిన్నబోయింది అని టాక్.రాశి గ్లామర్ డోసు కోసమైనా సినిమాను ఓ రెండు మూడు సార్లు చూడటంలో తప్పు లేదట.

అంతలా ఈ ఢిల్లీ సుందరి రెచ్చిపోయిందంట.ఇక ఫిలింనగర్ లో వినిపిస్తున్న గాసిప్ ఏమిటంటే, ఈ చిత్రంలో రాశీ బికినిలో కనిపించనుందట.

మరి అదే నిజమై రాశీ బికినిలో కనిపిస్తే కుర్రాళ్ళంతా గుండెలను ఎక్కడ దాచుకోవాలో! బెంగాల్ టైగర్ ఈ నెల 10వ తేదిన ప్రేక్షకుల ముందుకు రానుంది.

Ice cubes skin care : ఈ ఐస్ క్యూబ్స్ తో రెగ్యుల‌ర్‌గా మ‌సాజ్ చేసుకుంటే క్లియ‌ర్ స్కిన్ మీసొంతం!

తాజా వార్తలు