ధోనితో ఎఫైర్, ఛాన్స్ కోసం పడుకోవటం .. అన్నిటి గురించి చెప్పేసిన హీరోయిన్

అందాల తార లక్ష్మీరాయ్ బాలీవుడ్లో పాగా వేసేందుకు పావులు కదుపుతోంది.లక్ష్మీరాయ్ హీరోయిన్ అవకాశాలు రావడం ఇప్పుడు తగ్గిపోయింది.

చాన్నాళ్లుగా అడపాదడపా ఐటమ్ సాంగ్లో చేసుకుంటూ తన కెరీర్ ని నడుపుకొస్తోంది ఈ రత్తాలు‌.ఇలాంటి దశలో అదృష్టం వరించి 2004 లో సంచలన విజయం సాధించిన జూలి చిత్రానికి సీక్వెల్ చేసే అవకాశం వచ్చింది.

జూలీకి సీక్వెల్ అంటే ప్రేక్షకులు అద్యంతం హాట్ సన్నివేశాలు ఆశిస్తారు.వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుందట జూలి 2.ఈ బోల్డ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ బోల్డ్ ఇంటర్వ్యూ ఇచ్చింది రాయ్ లక్ష్మీ.అందులో తన కెరీర్ మొదలు, అవకాశాల కోసం పడ్డ కష్టాలు, అబ్బాయిలతో ప్రేమ వ్యవహారాలు, అందులోనూ భారత క్రికేట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో డేటింగ్, నగ్న సన్నివేశాలపై ఆసక్తి ‌.అన్నటీ గురించి మాట్లాడింది లక్ష్మీ.15 ఏళ్ళకే సినిమా ఇండస్ట్రీలో కి అడుగుపెట్టిన లక్ష్మీ మొదట్లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదట.కాని ఆ తరువాతే, కొంతమంది ఇండస్ట్రీలో కోరికలు తీర్చమని అడిగారని, కాదనేసరికి ఎన్నో అవకాశాలు కోల్పోయానని చెప్పింది లక్ష్మీ.

ధోని ఐపియల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడతాడనే విషయం తెలిసిందే.ఐపియల్ తొలిరోజుల్లోనే చెన్నైలో ధోనికి లక్ష్మీకి పరిచయం ఏర్పడింది‌.ధోని ఈ హీరోయిన్ తో పీకల్లోతూ ప్రేమలో ఉన్నాడని అప్పట్లో మీడియా తెగ రాసేది.

Advertisement

అయితే, ధోనితో కొన్నాళ్ళు డేటింగ్ చేసిన మాట వాస్తవమే అయినప్పటికీ, మీడియా రాసినట్టుగా, పెళ్ళి గురించి ఆలోచించేంత సీరియస్ గా తాము ఎప్పుడు లేమని, అదంతా గతం, ఇప్పుడు ధోనికి పెళ్ళి అయ్యింది, ఓ పాప ఉంది, అవి మాట్లాడుకోవడం సంస్కారం కాదు అంటూ అభిప్రాయపడింది రాయ్ లక్ష్మీ.జూలి 2 ఆమె తండ్రి చూసారట.

అలాంటి సన్నివేశాలు ఉండటంతో తన తండ్రితో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు‌.కాని అయన ఈ జెనరేషన్ పోకడలను అర్థం చేసుకుంటారు అని చెప్పింది లక్ష్మీ.

ఇక నగ్న సన్నివేశాలు చూడటానికి ఎలాంటి ఇబ్బంది లేకున్నా, అలాంటి సీన్లు చేసేందుకు ప్రస్తుతానికైతే తాను సిద్దంగా లేనని తెలిపింది ఈ 28 ఏళ్ళ సుందరాంగి.అన్నట్లు, జూలి 2 అక్టోబర్ 6న విడుదల కానుంది.

హెయిర్ ఫాల్ తో ఇక నో వర్రీ.. ఈజీగా వదిలించుకోండిలా!
Advertisement

తాజా వార్తలు