తల్లి తండ్రులు చేసిన తప్పు వల్లే ఆర్ నారాయణమూర్తి పెళ్లి చేసుకోలేదా..!

కొంతమంది డబ్బుల కోసం సినిమాలు చేస్తుంటారు, కొంతమంది ఆసక్తితో సినిమాలు చేస్తుంటారు, కానీ జనం కోసం సినిమాలు తీసే ఏకైక హీరో ఆర్ నారాయణమూర్తి.

ఈయన లాభం ఆశించి ఒక్క సినిమా కూడా చెయ్యదు, తన భావాలను స్పష్టం గా జనాలకు తెలియచేస్తూ వారిలో చైతన్యం కలిగించేందుకు సినిమా అనే మాధ్యమం ని వాడుకున్నాడు.

ముఖ్యంగా వెనుకబడిన తరాల వారి గోడుని తన సినిమాల ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు నారాయణ మూర్తి.కొన్ని సినిమాలు సంచలన విజయాలు సాధించాయి.

కొన్ని సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి, కానీ ఆర్ నారాయణ మూర్తి సిద్ధాంతం మాత్రం ఇప్పటి వరకు వదులుకోలేదు.ఆయన హీరో గా మారేముందు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసాడు, ఆ తర్వాత ఆయన ఎర్ర సైన్యం( Erra sinyam ) అనే సినిమా ద్వారా హీరోగా మారి, అదే చిత్రం తో డైరెక్టర్ గా కూడా రాణించాడు.

R. Narayanamurthy Did Not Get Married Because Of The Mistake Of Parents , R. Nar

ఎర్ర సైన్యం చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కడమే కాకుండా, కమర్షియల్ గా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది.ఈ చిత్రం తర్వాత అయన స్వర్గీయ శ్రీ దాసరి నారాయణరావు( Shri Dasari Narayana Rao ) దర్శకత్వం లో తెరకెక్కిన ఒరేయ్ రిక్షా( Orei Rickshaw ) అనే మూవీ లో హీరో గా నటించాడు, ఆ సినిమా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.అలా వరుస సూపర్ హిట్స్ తో ఆర్ నారాయణమూర్తి కి ఒక ప్రత్యేకమైన మార్కెట్ ఏర్పడింది.

Advertisement
R. Narayanamurthy Did Not Get Married Because Of The Mistake Of Parents , R. Nar

అలా ఆయన హీరోగా మరియు దర్శకుడిగా ఎన్నో మంచి చిత్రాలను తీసాడు.అవి కమర్షియల్( Commercial ) గా సక్సెస్ అయ్యిందా లేదా అనేది పక్కనపెడితే నమ్మిన సిద్ధాంతం కోసం, డబ్బులు సంపాదించే మార్గాలు ఎన్ని ఉన్నా , నాకు అవసరం లేదు, మనసుకు నచ్చినట్టే నేను ఉంటాను అనే ధోరణితో ముందుకు సాగిన నారాయణ మూర్తి అంటే ప్రతీ ఒక్కరికీ ఎంతో గౌరవం.

ఆయన చివరిసారిగా వెండితెర మీద కనిపించిన చిత్రం రైతన్న.

R. Narayanamurthy Did Not Get Married Because Of The Mistake Of Parents , R. Nar

ఇది ఇలా ఉండగా ఆర్ నారాయణమూర్తి ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనే దానిపై సోషల్ మీడియా లో రకరకాల వార్తలు వినిపించేవి.అయితే రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణం ని చెప్పుకొచ్చాడు.ఆయన మాట్లాడుతూ చిన్నప్పుడు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను.

చేసుకుంటే ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను,కానీ మా ఇంట్లో ఆ పెళ్ళికి ఒప్పుకోలేదు, మా అమ్మానాన్నలు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆత్మహత్య చేసుకొని చనిపోతామని బెదిరించారు, వాళ్ళ కోసం ఆ అమ్మాయిని వదిలేసాను.దాంతో పాటు తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, అసలే నా జీవితం లో పెళ్లి అనేదే వద్దు అనుకున్నాను.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?

పెళ్లి చేసుకోకుండా ఎంతో మంది మహానుభావులు లేరా, వారిలో నేను కూడా ఒకడిగా మిగిలిపోతాను అంటూ చెప్పుకొచ్చాడు ఆర్ నారాయణమూర్తి.ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

Advertisement

తాజా వార్తలు