ఒత్తిడిని అధిగమించడానికి తోడ్ప‌డే ఉత్తమ చిట్కాలు ఇవే!

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో దాదాపు ప్రతి ఒక్కరూ ఒత్తిడితో సావాసం చేస్తున్నారు.

బడికి వెళ్లే పిల్లల దగ్గర నుంచి కార్పొరేట్ దిగ్గజాల వరకు అంతా మానసిక ఒత్తిడితో నలిగిపోతున్నారు.

నిరుద్యోగం, అధిక పనిభారం, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ఇష్యూస్, బిజీ లైఫ్ స్టైల్, ఇష్టమైన వారు దూరం కావడం, కోరుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోవడం తదితర అంశాలు ఒత్తిడికి కారణం అవుతుంటాయి. ఒత్తిడి( stress ) చిన్న సమస్యగానే కనిపించిన చాలా ప్రమాదకరమైనది.

దీన్ని నిర్లక్ష్యం చేస్తే క్రమంగా డిప్రెషన్ కు దారితీస్తుంది.అందువల్ల ఒత్తిడికి గురైనప్పుడు దాన్ని అధిగమించడానికి ప్రయత్నించాలి.

అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే కొన్ని చిట్కాలు ఉత్తమంగా సహాయపడతాయి.మరి ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

Advertisement

సగం శాతం మందిలో ఒత్తిడి తలెత్తడానికి ప్రధాన కారణం కంటి నిండా నిద్ర లేకపోవడం.రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్రిస్తే బాడీ మరియు మైండ్ యాక్టివ్ గా, స్ట్రాంగ్ గా ఉంటాయి దాంతో ఒత్తిడికి సులభంగా చెక్ పెట్టవచ్చు.ఒత్తిడికి గురైన‌ప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ను ప్ర‌య‌త్నించాలి.

ప్రాణాయామం మంచి ఎంపిక అవుతుంది.ఇది ఒక నాసికా రంధ్రం ద్వారా శ్వాస తీసుకునే యోగ పద్ధతి.

ప్రాణాయామం మనస్సు మరియు శరీరాన్ని సమతుల్యం చేస్తుంది. రక్తపోటు, హృదయ స్పందన రేటు( Blood pressure, heart rate )ను అదుపులోకి తెచ్చి ఒత్తిడిని చిత్తు చేస్తుంది.

ఒత్తిడికి లోనై ఏకాగ్ర‌త‌ను కోల్పోయిన‌ప్పుడు ప‌నంతా ప‌క్క‌న పెట్టేసి కాసేపు ఒంటరిగా వాకింగ్ ( Walking )చేయండి.ప‌చ్చ‌ని వాతావ‌ర‌ణంలో వాకింగ్ చేస్తే మ‌రింత వేగంగా ఒత్తిడి నుంచి బ‌య‌ట‌ప‌డ‌తారు.

ఎన్టీఆర్ నాకన్నా చిన్నోడు... నన్ను మాత్రం ఒరేయ్ అని పిలుస్తాడు : రాజీవ్ కనకాల 
జాక్ మూవీ సెన్సార్ రివ్యూ.. సిద్ధు జొన్నలగడ్డ మరో బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తారా?

ఒత్తిడిని అధిగమించడానికి మ్యూజిక్ కూడా ఎంతో బాగా స‌హాయ‌ప‌డుతుంది.సంగీతం వినడం వల్ల చెడు మానసిక స్థితికి త్వరగా పరిష్కారం లభిస్తుంది.

Advertisement

మైండ్ రిలాక్స్ అవుతుంది.ఒత్తిడి ఇబ్బంది పెడుతున్నప్పుడు కాసేపు చిన్న పిల్లలతో ఆడుకోవడం, పెట్స్ తో టైం స్పెండ్ చేయడం, పేప‌ర్ పై బొమ్మ‌లు గీయ‌డం, పెయింటింగ్ వేయ‌డం వంటివి చేయాలి.

తద్వారా మాన‌సిక ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది.ఆందోళన దూరం అవుతుంది.

- డార్క్ చాక్లెట్ ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ స్థాయిలను నియంత్రిస్తుంది మరియు జీవక్రియను స్థిరీకరిస్తుంది.కాబ‌ట్టి ఒత్తిడికి గురైన‌ప్పుడు మీరు డాక్క్ చాక్లెట్ ను తిన‌వ‌చ్చు.ఒక గ్రీన్ టీ, మింట్ టీ, జింజ‌ర్ టీ వంటి హెర్బ‌ల్ డ్రింక్స్ కూడా ఒత్తిడిని త‌రిమికొట్ట‌డానికి తోడ్ప‌డ‌తాయి.

తాజా వార్తలు