ముందుకు జరిగిన పుష్ప.. తగ్గేదే లే!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ కోసం కేవలం తెలుగు ఆడియెన్స్ మాత్రమే కాకుండా ఇతర భాషల ఆడియెన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో వీరిద్దరి కాంబోలో రాబోయే మూడో సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా ఈపాటికి రిలీజ్ కూడా అయ్యేది.కానీ కరోనా కారణంగా ఇతర సినిమాల్లాగా ఈ సినిమా కూడా ఆలస్యం అవుతూ వచ్చింది.

అయితే ఇప్పుడు మాత్రం ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.ప్రస్తుతం చివరిదశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, అటుపై పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా అంతే స్పీడుగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ చూస్తోంది.

అయితే ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు గతంలో చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.కానీ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అనుకున్నదానికంటే స్పీడుగా జరుగుతుండటంతో రిలీజ్ డేట్ విషయంలో మరోసారి చిత్ర యూనిట్ ఆలోచిస్తుందట.

Advertisement

కాగా ఈ సినిమాను డిసెంబర్ చివరికి రిలీజ్ చేస్తే బాక్సాఫీస్ వద్ద లాంగ్ రన్ సాధ్యం కాదని భావించి, ఈ సినిమాను ఓ వారం ముందుకు జరిపారట.దీంతో పుష్ప చిత్రాన్ని డిసెంబర్ 17న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ అన్ని విధాలుగా రెడీ కాబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

పూర్తిగా అడవి నేపథ్యంలో సాగే ఈ సినిమాలో బన్నీ పుష్పరాజ్ అనే ఎర్రచందనం స్మగ్లర్‌గా కనిపిస్తాడు.ఈ సినిమాలో ఆయన లుక్ ప్రేక్షకులను ఇప్పటికే ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

అందాల భామ రష్మక మందన హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లనుందట.పుష్ప చిత్రం ముందుకు జరగడంతో బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వినాయకుడు, లక్ష్మీదేవిని కలిపి పూజించడానికి కారణం ఏమిటో తెలుసా?
Advertisement

తాజా వార్తలు