పుష్ప ది రూల్ మూవీ ఫైనల్ కలెక్షన్ల లెక్కలివే.. ఆ రికార్డ్ మాత్రం బ్రేక్ కాలేదుగా!

అల్లు అర్జున్ , సుకుమార్ ( Allu Arjun, Sukumar )కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప ది రూల్ మూవీ ఫైనల్ రన్ పూర్తైంది.

ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

పుష్ప ది రూల్ మూవీ ఫుల్ రన్ లో ఏకంగా 1871 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం.అయితే దంగల్ సినిమా కలెక్షన్ల రికార్డ్ మాత్రం బ్రేక్ కాలేదు.బాహుబలి2 ఫుల్ రన్ కలెక్షన్లు 1810 కోట్ల రూపాయలు అనే సంగతి తెలిసిందే.బాహుబలి2 సినిమా ఫుల్ రన్ కలెక్షన్లను పుష్ప2 సినిమా( Pushpa 2 movie ) సులువుగానే బ్రేక్ చేసిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.బాలీవుడ్ ఇండస్ట్రీలో పుష్ప2 కలెక్షన్ల విషయంలో సంచలనాలు సృష్టించింది.

కేవలం హిందీ బెల్ట్ లో పుష్ప2 మూవీ 850 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించడం గమనార్హం.పుష్ప ది రూల్ మూవీ మలయాళం మినహా మిగతా అన్ని భాషల్లో సంచలనాలు సృష్టించింది.

Pushpa The Rule Movie Final Collections Details Inside Goes Viral In Social Med

ఓవర్సీస్ లో పుష్ప2 సినిమా సాధించిన కలెక్షన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.పుష్ప ది రూల్ మూవీ హిందీలో త్రీడీ వెర్షన్ కూడా ప్రదర్శితమైంది.బన్నీ సుకుమార్ కాంబోలో పుష్ప3 తెరకెక్కనుండగా ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాల్సి ఉంది.పుష్ప3 సెట్స్ పైకి వెళ్లడానికి మరో మూడేళ్ల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి.

Pushpa The Rule Movie Final Collections Details Inside Goes Viral In Social Med
Advertisement
Pushpa The Rule Movie Final Collections Details Inside Goes Viral In Social Med

పుష్ప3 మూవీ 600 నుంచి 700 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది.బన్నీ ప్రస్తుతం త్రివిక్రమ్, అట్లీ సినిమాలతో బిజీగా ఉండగా ఈ రెండు సినిమాలపై అంచనాలు పెరుగుతున్నాయి.బన్నీ భవిష్యత్తు సినిమాలతో పుష్ప2 సినిమాను మించిన విజయాన్ని అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

పుష్ప ది రూల్ మూవీలో కథ, కథనంలో ఊహించని స్థాయిలో ట్విస్టులు ఉండటం ఈ సినిమాకు ప్లస్ అయింది.

Advertisement

తాజా వార్తలు