పుష్ప 2 ఐటెం సాంగ్ కోసం బాలీవుడ్ సుందరి.. ఒప్పుకుంటే అదిరిపోవడమే!

టాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాలలో పుష్ప ది రూల్( Pushpa the Rule ) ఒకటి.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) హీరోగా లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇప్పటికే అంచనాలు భారీ లెవల్లో ఉన్నాయి.

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా పార్ట్ 1 సౌత్ మాత్రమే కాదు నార్త్ వాళ్ళను కూడా ఆకట్టుకుంది.అందుకే ఈసారి పార్ట్ 1 ను మించి తెరకెక్కిస్తున్నారు.

దీంతో ఈ సినిమాకు పోటీ లేకుండా సేఫ్ జోన్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ రిలీజ్ డేట్ ను ఖరారు చేసారు.ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 15న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపు కుంటుంది.ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేయగా మాసివ్ రెస్పాన్స్ అందుకుంది.

Pushpa The Rule Interesting Update, Pushpa The Rule, Pushpa 2, Allu Arjun, Sukum
Advertisement
Pushpa The Rule Interesting Update, Pushpa The Rule, Pushpa 2, Allu Arjun, Sukum

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది.ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ను రంగం లోకి దించుతున్నట్టు టాక్ వినిపిస్తుంది.పార్ట్ 1 లో స్టార్ హీరోయిన్ సమంతతో ఐటెం సాంగ్ చేయించి యూత్ తో ఊ అంటావా మావ ఊఊ అంటావా అని స్టెప్పులు వేయించారు.

ఇక ఇప్పుడు అంతకు మించి అనేలా పార్ట్ 2 లో ఐటెం సాంగ్ ను ప్లాన్ చేసారని తెలుస్తుంది.

Pushpa The Rule Interesting Update, Pushpa The Rule, Pushpa 2, Allu Arjun, Sukum

ఈ సాంగ్ ను బిటౌన్ హీరోయిన్ జాన్వీ కపూర్( Janhvi Kapoor ) తో చేయించాలని ప్లాన్ చేస్తున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.అలాగే జాన్వీ కపూర్ తో థియేటర్స్ ఊగిపోయేలా స్టెప్పులు వేయించబోతున్నట్టు టాక్.మరి జాన్వీ కపూర్ ఈ సాంగ్ లో చిందేయడానికి ఒప్పుకుంటుందో లేదో వేచి చూడాలి.

కాగా ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

వినాయకుడి శరీరం ఇన్నింటికి సంకేతమా?
Advertisement

తాజా వార్తలు