ఫిలింఫేర్ లోనూ తగ్గేదే లే అంటూ సత్తా చాటిన పుష్ప?

దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఫిలింఫేర్ అవార్డులు ఎంతో ఘనంగా జరిగాయి.

గత రెండు సంవత్సరాల నుంచి కరోనా వల్ల ఈ వేడుకలను నిర్వహించలేదు ఈ క్రమంలోనే బెంగళూరులో ఆదివారం సాయంత్రం ఈ వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి.

ఇకపోతే ఈ ఫిలింఫేర్ అవార్డులలో భాగంగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప సినిమా హవా కొనసాగింది.పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా ఎన్నో అద్భుతమైన రికార్డులను సృష్టించింది.

ఈ క్రమంలోనే ఫిలింఫేర్ అవార్డులలో కూడా ఏమాత్రం తగ్గేదే అన్నట్టు ఏకంగా ఏడు విభాగాలలో అవార్డులను అందుకున్నారు.ఇక ఆదివారం బెంగుళూరులో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కన్నడ నటుడు దివంగత పునీత్ రాజ్ కుమార్ కి ఈ ఏడాది జీవిత సాఫల్య పురస్కారం లభించింది.

ఇకపోతే పుష్ప సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో ఏకంగా ఏడు కేటగిరీలలో భాగంగా ఫిలింఫేర్ అవార్డులను సొంతం చేసుకున్నారు.

Pushpa Showed Her Ability Saying That There Is No Decrease In Filmfare Pushpa ,
Advertisement
Pushpa Showed Her Ability Saying That There Is No Decrease In Filmfare Pushpa ,

ఉత్తమ దర్శకుడిగా సుకుమార్, ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్, ఉత్తమ చిత్రంగా పుష్ప, ఉత్తమ గాయకుడు సిద్ శ్రీరామ్, ఉత్తమ గాయని ఇంద్రావతి చౌహన్, ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా మిరోస్లా బ్రొజెక్ ఫిలింఫేర్ అవార్డులను సొంతం చేసుకున్నారు.ఈ సినిమాతో పాటు తమిళ స్టార్ హీరో సూర్య నటించిన సురారై పోట్రు సినిమాకి గాను 7 ఫిలింఫేర్ అవార్డులను కైవసం చేసుకోవడం విశేషం.ఇకపోతే ఈ సినిమాలో నటించినందుకు సూర్య జాతీయ స్థాయి పురస్కారాన్ని కూడా అందుకున్న విషయం మనకు తెలిసిందే.

హైదరాబాద్ చేరుకున్న మార్క్ శంకర్.. వీడియో వైరల్
Advertisement

తాజా వార్తలు