పుష్ప2 పోస్టర్ తో సరికొత్త రికార్డ్ సాధించిన బన్నీ.. ఈ అల్లు హీరోకు మాత్రమే సాధ్యమంటూ?

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతున్నాడు అల్లు అర్జున్.

ఏడాది కిందట డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా మూవీ పుష్ప సినిమా పలు భాషలలో విడుదలై మంచి రికార్డు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇందులో అల్లు అర్జున్( Allu arjun ) సరసన నటించిన రష్మిక మందన్నకు కూడా నటించగా వీరిద్దరికీ పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు వచ్చిందని చెప్పాలి.

ఇక మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో పార్ట్ 2( Pushpa 2 ) కోసం ప్రేక్షకులు తెగ ఎదురు చూస్తున్నారని చెప్పాలి.ఆ మధ్యనే పార్ట్-2 కు సంబంధించిన వీడియో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో చూసాం.అంతేకాకుండా ఆయన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు సినీ బృందం.

అందులో బన్నీ గంగమ్మ జాతరలో ఉన్న ఒక వ్యక్తిగా డిఫరెంట్ గెటప్ తో కనిపించాడు.ఆ లుక్ చూసి అల్లు అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు.

Advertisement

దీంతో పార్ట్ 2 పై భారీ అంచనాలు పెరిగాయని చెప్పాలి.ఇక పార్ట్ 1 మొత్తం పుష్ప కూలి నుండి సిండికేట్ వరకు ఎదిగిన విధానం చూపించారు.ఇక పార్ట్ 2లో ఆయన స్మగ్లింగ్ చేసి సంపాదించిన డబ్బుతో పేదలకు, పిల్లలకు ఉచిత విద్య వైద్య, అవసరమైన సహాయాలు అందించినట్లుగా చూపించారు.

అయితే ఫస్ట్ లుక్ విడుదలై చాలా రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఆ లుక్ బోర్ కొట్టించకుండా ఉంది.ఇక ఆ లుక్ ఇంస్టాగ్రామ్ లో ఆల్ టైం రికార్డు కొట్టిందని చెప్పాలి.

ఏకంగా ఏడు మిలియన్ లైక్స్ సాధించింది.దీంతో అల్లు అభిమానులు ఆ రికార్డు చూసి తెగ పొంగి పోతున్నారు.

అది తమ హీరోకే సాధ్యం అంటూ పొగడ్తలతో ముంచుతున్నారు.ఇక ప్రస్తుతం పార్ట్ 2 షూటింగ్ బిజీలో ఉంది.

రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 
Advertisement

తాజా వార్తలు