బన్నీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.... పుష్ప2 ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా నటించిన తాజా చిత్రం పుష్ప 2(Pushpa 2) .

సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

పాన్ ఇండియా స్థాయిలో ఏకంగా 1850 కోట్ల కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది.ఇలా అల్లు అర్జున్ నటించిన పుష్ప, పుష్ప 2 సినిమాలు ఈయనకు ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకువచ్చాయి.

ఇక ఇప్పటికి కూడా థియేటర్లలో పుష్ప 2 సినిమా హావా కొనసాగుతూనే ఉందని చెప్పాలి.

ఇక సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మరికొన్ని సన్నివేశాలను జత చేస్తూ పుష్ప రీ లోడెడ్ (Pushpa Reloaded)అంటు మరోసారి థియేటర్లలో పుష్పరాజ్ హవ కొనసాగుతుందని చెప్పాలి.ఇలా ఈ సినిమా థియేటర్లలో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది అయితే ఈ సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధమైందని తెలుస్తోంది.ఈ సినిమాఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ (Net Flix) భారీ ధరలకు కొనుగోలు చేశారు.

Advertisement

  అయితే ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో విడుదలకు సిద్ధమైందని తెలుస్తోంది.

ఇలా థియేటర్లలో భారీ కలెక్షన్లను రాబట్టి సంచలనం సృష్టించిన ఈ సినిమా  జనవరి 30వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కాబోతుందని విషయం తెలియడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ స్ట్రీమింగ్ తేదీ గురించి నెట్ ఫ్లిక్స్ అధికారిక ప్రకటన తెలియజేయాల్సి ఉంది.ఇక ఈ సినిమా థియేటర్లలోకి డిసెంబర్ 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇలా థియేటర్లలో ప్రభంజనం సృష్టించిన ఈ సినిమా డిజిటల్ మీడియాలో ఎలాంటి హవా కొనసాగిస్తుందో తెలియాల్సి ఉంది.ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడిగా నటి రష్మిక మందన్న నటించిన విషయం తెలిసిందే.

టాలీవుడ్ ఇండస్ట్రీని టార్గెట్ చేస్తున్న ఐటీ.. తెర వెనుక ఇంత జరిగిందా?
Advertisement

తాజా వార్తలు