థియేటర్లో బ్లాక్ బస్టర్ .... అక్కడ మాత్రం డిజాస్టర్... ఏంటీ పుష్ప ఇలా అయ్యింది!

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్(Allu Arjun) రష్మిక(Rashmika) హీరో హీరోయిన్గా నటించిన చిత్రం పుష్ప 2(Pushpa 2).

ఈ సినిమా గత ఏడాది చివరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది.ఇలా థియేటర్లో మాత్రమే కాకుండా ఈ సినిమా డిజిటల్ మీడియాలో కూడా అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

తాజాగా పుష్ప 2 సినిమా బుల్లితెరపై వరల్డ్ ప్రీమియర్ షో టెలికాస్ట్ అయ్యింది.

Pushpa 2 Movie Getting Less Trp Rating At Television Premiar , Pushpa 2,allu Arj

ఈ విధంగా బుల్లి తెరపై టెలికాస్ట్ అయిన ఈ సినిమాకు ఊహించని షాక్ తగిలింది.పుష్ప 2కు బుల్లి తెర మీద కేవలం 12.6 టీఆర్పీ రేటింగ్ వచ్చింది.గతంలో బన్నీ నటించిన అల వైకుంఠపురములో (29.4), పుష్ప ది రైజ్ (22.5) రేటింగ్స్ సాధించడంతో పుష్ప 2కు కూడా అదే స్థాయిలో రెస్పాన్స్ ఉంటుందనే అందరూ భావించారు కానీ ఈ సినిమాకు మాత్రం బుల్లితెరపై కేవలం 12.6 టిఆర్పి రేటింగ్ రావడం గమనార్హం.వెండి తెరపై పాన్ ఇండియా స్థాయిలో సరికొత్త రికార్డులను సృష్టించిన ఈ సినిమా బుల్లితెరపై మాత్రం అనుకున్న ఆదరణ పొందలేక పోయిందని చెప్పాలి.

Pushpa 2 Movie Getting Less Trp Rating At Television Premiar , Pushpa 2,allu Arj
Advertisement
Pushpa 2 Movie Getting Less Trp Rating At Television Premiar , Pushpa 2,Allu Arj

ఇలా ఈ సినిమా రేటింగ్ తగ్గడానికి కూడా కారణాలు లేకపోలేదు.ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ రావడంతో దాదాపు ప్రేక్షకులు అందరూ కూడా థియేటర్లలోనే ఈ సినిమాని చూడటం వల్ల బుల్లి తెరపై చూడటానికి పెద్దగా ఆసక్తి చూపించలేదని తెలుస్తుంది.ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తన తదుపరి సినిమా డైరెక్టర్ అట్లీతో చేయబోతున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమా గురించి అధికారకంగా ప్రకటన జారీ చేశారు.నిజానికి త్రివిక్రమ్ తో చేయాల్సిన అల్లు అర్జున్ కొన్ని కారణాలవల్ల త్రివిక్రమ్ సినిమాని వాయిదా వేసుకొని అట్లీ సినిమాతో బిజీ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు