ఊ అంటావా మామ కిస్సిక్ సాంగ్స్ లో బెస్ట్ సాంగ్ ఇదే.. అసలేం జరిగిందంటే?

అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా నటించిన పుష్ప పార్ట్ వన్ సినిమా 2021లో విడుదల అయ్యి ఎంతటీ సాధించిందో మనందరికీ తెలిసిందే.

పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా అన్నిచోట్ల భారీగా కలెక్షన్స్ ని సాధించింది.

మరి ముఖ్యంగా ఊ అంటావా మామ.ఉఊ అంటావా మావ అనే పాట మాత్రం యావత్ దేశాన్ని ఒక ఊపు ఊపేసింది అన్న విషయం మనందరికీ తెలిసిందే.పుష్ప సినిమాలో ఎన్నో సాంగ్స్ ఉండగా వాటన్నింటి కంటే ఈ సాంగ్ మాత్రం బాగా వైరల్ అవ్వడంతోపాటు బాగా హిట్ అయిందని చెప్పాలి.

ఇకపోతే ఈ సినిమాకు సీక్వెల్ గా ఇప్పుడు పుష్ప 2( Pushpa 2 ) రాబోతున్న విషయం తెలిసిందే.డిసెంబర్ 5న ఈ సినిమా గ్రాండ్గా విడుదల కానుంది.

ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా నుంచి కిస్సిక్ అనే ఐటమ్ సాంగ్ ( Kissik )ని విడుదల చేశారు.అయితే ఈ పాటకు చాలా వరకు నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.

Advertisement
Pushpa 1 Item Song Is More Better Than Kissik Song In Pushpa 2, Pushpa 2, Pushpa

అలా బాగోలేదని చెప్పలేము ఇలా బాగుందని చెప్పలేము.ఎందుకంటే ప్రేక్షకులు ఈ పాటను ఊ అంటావా మావ కంటే మించి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఈ సినిమా ఆ పాటకు అంచనాలను కూడా అందుకోలేకపోయింది.

ఈ పాటకు అంత స్థాయి లేదంటున్నారు జనం.

Pushpa 1 Item Song Is More Better Than Kissik Song In Pushpa 2, Pushpa 2, Pushpa

అయితే నిజానికి చాలా పాటలు ఇనిస్టెంట్ గా హిట్ అవ్వవు.వినగా వినగా వైరల్ అవుతుంటాయి.మొదట్లో పుష్ప పాట విన్నప్పుడు కూడా ఈ విధంగానే రియాక్ట్ అయ్యారు.

కానీ ఆ తర్వాత ఆ పాట ఏ రేంజ్ లో సక్సెస్ అయిన విషయం తెలిసిందే.అలాగే ఈ పాట కూడా బాగానే ఉన్న త్వరలో మరింత సక్సెస్ అవుతుందని మూవీ మేకర్స్ భావిస్తున్నారు.

సమాజంపై ఎంతో ఎక్కువ గా తమ ప్రభావాన్ని చూపిన చిత్రాలు ఇవే

అయితే తాజాగా రిలీజైన కిస్సిక్ సాంగ్ కు ఆ లక్షణాలు కూడా లేవంటున్నారు జనం.వినగా వినగా వైరల్ అయ్యేంత కంటెంట్ ఇందులో కనిపించడం లేదు అంటున్నారు.ఊ అంటావా.

Advertisement

సాంగ్ లో ఆ పదం అందర్నీ పట్టుకుంది.దానిచుట్టూ తాత్వికంగా రాసిన లైన్స్, మ్యూజిక్ అలా అతుక్కుపోయాయి.

కిస్సిక్ సాంగ్ లో ఇలా దేన్ని హైలెట్ చేయాలో మ్యూజిక్ డైరక్టర్ కు అర్థమైనట్టు లేదు.సాంగ్ మొదలైన నిమిషం వరకు కిస్.కిస్ అంటూ హమ్మింగ్ వినిపిస్తుంది.

ఇందులో కొత్తదనం లేదు.ఏదో పబ్ లో వినిపించిన మ్యూజిక్ టైపులోనే ఉంది.

ఆ తర్వాత దెబ్బలు పడతాయ్ అనే హుక్ లైన్ ఎత్తుకున్నారు.అదేదో ముందు నుంచే ఎత్తుకుంటే బాగుండేదనే ఫీలింగ్ వచ్చింది.

మొత్తంగా చూస్తే ఈ కిస్సీక్ సాంగ్ తో పోలిస్తే ఊ అంటావా మామ అనే పాట అద్భుతంగా ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు నేటిజన్స్.

తాజా వార్తలు