హీరోలను సూపర్ స్టార్లుగా మార్చిన పూరీ.. వీరి మాస్ ఇమేజ్ పెంచేశాడు..!!

పూరి జగన్నాథ్( Puri Jagannadh ) పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, మహేష్ బాబు వంటి చాలామంది హీరోలను స్టార్ హీరోలుగా మార్చేసాడు.

సినిమా హీరోలే పూరి జగన్నాథ్ సినిమాలు చేశాక ఎంతో కొత్తగా, గొప్పగా ఫీల్ అయ్యారు.

తమ ఇమేజ్ ను పూర్తిగా మార్చేసింది పూరి జగన్నాథే అని చాలా సందర్భాల్లో కూడా చెప్పారు.ఒకానొక సమయంలో ప్రభాస్( Prabhas ) "బుజ్జిగాడు" సినిమా రిలీజ్ కోసం 6 నెలలు వెయిట్ చేశానని చెప్పాడు.

ఎందుకంటే అది అతనికి అంత బాగా నచ్చింది.ఆ సినిమా థియేటర్లలోకి రావాలని, దాన్ని చూసి ప్రేక్షకులు అందరూ ఎంజాయ్ చేయాలని, తాను కూడా ఆ సినిమాలో తనని తాను చూసుకుని మురిసిపోవాలని భావించాడు.

అంత బాగా బుజ్జిగాడు( Bujjigadu ) సినిమాని పూరి జగన్నాథ్ తీశాడు.

Advertisement

"చేతి మీద ఇలా కొడితే ఒక నరం వస్తది, ఈ నరాన్ని ఇలా పట్టుకొని గట్టిగా లాగితే 100 మీటర్ల తాడు వస్తది" అనే డైలాగు తనకు బాగా నచ్చినట్లు కూడా తెలిపాడు.ఈ సినిమా తీశాక "ప్రభాస్ కంప్లీట్లీ ఒక డిఫరెంట్ యాక్టర్ అయిపోయాడు, బిఫోర్ బుజ్జిగాడు, ఆఫ్టర్ బుజ్జిగాడు అనే రేంజ్ లో అతడి మాస్ ఇమేజ్ చేంజ్ అయిపోయింది." అని రాజమౌళి కూడా అన్నాడు.

ఒక హీరో పూరి జగన్నాథ్ చేతిలో పడితే చాలు అతను సూపర్ స్టార్ అయిపోతాడు అని ప్రభాస్ ప్రశంసల వర్షం కురిపించాడు.

కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ని చాలా మాస్ అవతారంలో చూపించాడు పూరీ జగన్నాథ్.అందులో ఒక డైలాగ్ ఉంటుంది.ఆ డైలాగ్ పవన్ చెప్పినప్పుడు థియేటర్ దద్దరిల్లింది.

రవితేజ( Raviteja ) కెరీర్ సక్సెస్ లో కూడా పూరి చాలా కీలక పాత్ర పోషించాడు.రవితేజ చేత "నేనింతే" సినిమాలో ఒక్క రూపాయి కూడా సంపాదించలేని ఏ వెధవికి ఐ లవ్ యు చెప్పే అర్హత లేదు అంటూ ఒక అద్భుతమైన డైలాగ్ చెప్పించాడు.

ఈ నైట్ జెల్ తో మీ స్కిన్ అవుతుంది సూపర్ వైట్..!
అరుదైన రికార్డును సొంతం చేసుకున్న బుజ్జితల్లి.. సాయిపల్లవి, చైతన్య ఖాతాలో రికార్డ్!

టెంపర్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ ని( Jr NTR ) కూడా చాలా మాస్ క్యారెక్టర్ లో చూపించాడు.ఈ సినిమాలో తారక్ చెప్పిన "నీకు ఈగో లోపల ఉంటుందేమో, నాకు వైఫై లాగా చుట్టూ ఉంటుంది" అనే డైలాగ్ పెద్ద హిట్ అయింది.

Advertisement

ఇక పోకిరి సినిమాలో మహేష్ బాబు( Mahesh Babu ) కూడా ఎలా చూపించాడో అని స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు.యూత్ ఆడియన్స్ మాస్ ఆడియన్స్ కి ఈ హీరోలను దగ్గర చేశాడు పూరి జగన్నాథ్.

హీరోల ఇమేజ్ చేంజ్ఓవర్ చేయడంలో పూరి కీలక పాత్ర పోషించాడని రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.

తాజా వార్తలు