పూరి జగన్నాథ్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనేనా..?

బద్రి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన పూరి జగన్నాథ్( Puri Jagannadh ) మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు.

ఈ సినిమా తర్వాత జగపతి బాబు తో ఆయన చేసిన బాచి సినిమా పెద్దగా ఆడనప్పటికీ తర్వాత వరుసగా మూడు సినిమాలతో సూపర్ హిట్లను అందుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ నైతే క్రియేట్ చేసుకున్నాడు.

ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన వరుసగా చాలా సినిమాలు సక్సెస్ లను ఇస్తూ ఇండస్ట్రీలో తనను తాను స్టార్ డైరెక్టర్( Star Director ) గా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం అయితే చేశాడు.

ఇక ఇప్పటికి కూడా ఆయన చేసే ప్రతి సినిమా కూడా యూత్ లో మంచి గుర్తింపు పొందుతోంది.ఇక హిట్లు, ప్లాప్ లతో సంబంధం లేకుండా ఆయన సినిమాలను ఆదరించే ప్రేక్షకులు ఇప్పటికీ ఇండస్ట్రీ లో ఉన్నారు అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక ప్రస్తుతం ఆయన రామ్ తో డబల్ ఇస్మార్ట్( Double Ismart ) అనే సినిమా చేస్తున్నాడు.

ఇక ఈ సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ సాధిస్తే పూరి జగన్నాధ్ కెరియర్ మళ్ళీ గాడిలో పడుతోంది.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ మరొక సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తుంది.

Advertisement

ఇక ఇప్పటికే వరుణ్ దావన్ తో వరుస సినిమాలు చేస్తూ బాలీవుడ్ లో స్టార్ హీరోగా గుర్తింపు పొందుతున్నాడు.

ఇక ఈ సినిమాతో వరుణ్ ధావన్( Varun Dhawan ) తనను తాను ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు.అందుకే పూరి తో ఒక సినిమా చేస్తే తనకు యూత్ లో కూడా మంచి క్రేజ్ వస్తుంది.అలాగే తెలుగులో కూడా మంచి గుర్తింపు సంపాదించుకోవచ్చనే ఉద్దేశంతో పూరి జగన్నాథ్ తో సినిమాను ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

మరి పూరి చెప్పిన కథ కి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలైతే వస్తున్నాయి.ఇక వీళ్ళ కాంబినేషన్ లో సినిమా ఉంటుందా లేదా అనే విషయాలు ఉంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

గలిజేరు ఆకుల వల్ల ఎన్ని లాభాలంటే...!?
Advertisement

తాజా వార్తలు