Puri Jagannadh Chiranjeevi: మెగాస్టార్ కోసం అలాంటి స్టోరీ రాస్తున్న పూరీ.. వర్కౌట్ అయ్యేట్టుగానే ఉందిగా!

పూరీ జగన్నాథ్ అంటేనే మాస్ ఆడియెన్స్ ను తన డైలాగ్స్ తో మెప్పిస్తాడు.

ఇప్పటి వరకు పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.

టాలీవుడ్ లోనే డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు డైరెక్ట్ చేసిన ఈయనకు ఇప్పుడు మాత్రం గడ్డు కాలం ఎదురైంది అనే చెప్పాలి.ఎందుకంటే ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయినా లైగర్ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది.

ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించగా.రిలీజ్ అయినా అన్ని చోట్ల ప్లాప్ టాక్ తెచ్చుకుంది.

పూరీ జగన్నాథ్ గత సినిమా ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్.కానీ లైగర్ మరిన్ని అంచనాల మధ్య రిలీజ్ అయ్యి అట్టర్ ప్లాప్ అయ్యింది.

Advertisement

దీంతో ఈయన కెరీర్ మరోసారి ఢీలా పడిపోయింది.ప్రెజెంట్ లైగర్ పెట్టుబడులపై విచారణ ఎదుర్కుంటున్న విషయం విదితమే.

ఇదిలా ఉండగానే పూరీ నెక్స్ట్ సినిమా చేయడానికి ఏ హీరో అయిన ఒప్పుకుంటాడా లేదా అని అనుకున్నారు.కానీ పూరీ వెంటనే బౌన్స్ బ్యాక్ అయ్యి అప్పుడు స్టార్ హీరో కోసం వేట సాధించారని.

హీరో కూడా దొరికేశారని అంటున్నారు.మరి ఆ హీరో ఎవరో కాదు.మెగాస్టార్ చిరు అని తెలుస్తుంది.

ఇంతకు ముందే వీరి కాంబోలో సినిమా ఉంటుంది అని చిరు కూడా చెప్పిన విషయం తెలిసిందే.అయితే ఇప్పటి వరకు అది సాధ్యం కాలేదు.

Blaze: Seguridad Del Jugador Y Juego Responsable
Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...

కానీ ఇప్పుడు ఈ కాంబో వర్కౌట్ అయ్యేలాగానే ఉంది.పూరీ, మెగాస్టార్ చిరంజీవి కోసం ఇప్పటికే ఒక ఎమోషనల్ యాక్షన్ స్టోరీ రాస్తున్నాడట.

Advertisement

తండ్రి కొడుకుల మధ్య సాగే ఈ కథ ఇడియట్ కు కొనసాగింపుగా ఉంటుందని టాక్ వస్తుంది.ఈ సీమ తండ్రి పాత్ర మీద బేస్ అయ్యి ఎమోషనల్ గా ఇంకా యాక్షన్ బేస్డ్ గా నడుస్తుంది అని టాక్ వస్తుంది.

చూడాలి మరి ఈ సినిమా ఎప్పుడు వర్కౌట్ అవుతుందో.