ఏపీ ప్రభుత్వ తీరుపై పురంధేశ్వరి మండిపాటు

ఏపీ ప్రభుత్వ తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తీవ్రంగా మండపడ్డారు.

వైసీపీ నేతలు జేబులు నింపుకుంటున్నారన్న పురంధేశ్వరి టెక్కలి చుట్టు ఉన్న గ్రానైట్ పరిశ్రమలను తమ వారికి కట్టబెడుతున్నారని ఆరోపించారు.

పేద ప్రజలకు వైసీపీ ప్రభుత్వం ఏం న్యాయం చేసిందని ఆమె ప్రశ్నించారు.ఏడుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి పేదలపై భారం మోపారని మండిపడ్డారు.

రాష్ట్రంలో ఎంపీలకే రక్షణ లేదని విమర్శించారు.

Betfair Review And Player Reputation (UK) : An Analytical Guide
Advertisement