అమ్మో, గడ్డకట్టిన సరస్సుపై కుక్క.. ప్రాణాలకు తెగించి రక్షించిన భారతీయుడు..

కష్టాల్లో ఉన్నవారి పట్ల కరుణ చూపడమే నిజమైన మానవత్వం.న్యూజెర్సీలో( New Jersey ) జరిగిన ఓ సంఘటన దానికి చక్కటి నిదర్శనంగా నిలుస్తోంది.

ఇటీవల పార్సిప్పనీ సరస్సులో( Parsippany Lake ) ఓ కుక్క చిక్కుకుంది.అది గడ్డకట్టిన సరస్సు కావడంతో ఏ క్షణానైనా మంచు విరిగి కుక్క( Dog ) నీటిలో పడిపోయే ప్రమాదం ఉంది.

ఈ విషయం తెలుసుకున్న ఎన్నారై కిషన్ పటేల్( Kishan Patel ) వెంటనే స్పందించాడు.తన డ్రోన్‌ను ఉపయోగించి తెలివిగా ఆ కుక్కను కాపాడి రియల్ హీరో అనిపించుకున్నాడు.

వివరాల్లోకి వెళితే, క్రిస్మస్‌ ముందు రోజు, బ్రూక్లిన్‌( Brooklyn ) అనే 20 నెలల షీపాడూడుల్ కుక్క( Sheepadoodle Dog ) తన సంరక్షకుడి నుంచి తప్పించుకుని గడ్డకట్టిన సరస్సుపైకి వెళ్లిపోయింది.స్థానికులు, అధికారులు ఎంత ప్రయత్నించినా భయంతో ఆ కుక్క దాదాపు రోజంతా ప్రమాదకరమైన మంచుపైనే ఉండిపోయింది.

Advertisement

సమయం గడుస్తున్న కొద్దీ పరిస్థితి చాలా ఆందోళనకరంగా మారింది.

అక్కడే దగ్గరలో నివసించే కిషన్‌ పటేల్‌కు డ్రోన్‌( Drone ) ఉంది.కుక్కలంటే ప్రాణం కావడంతో చలించిపోయిన పటేల్‌, తన డ్రోన్‌తో రంగంలోకి దిగాడు.బ్రూక్లిన్‌ ఎక్కడుందో డ్రోన్‌ కెమెరా ద్వారా కనిపెట్టాడు.

డ్రోన్‌కు చికెన్‌ ముక్కలు కట్టి దాన్ని ఆ కుక్క దగ్గరకు పంపాడు.చికెన్‌ కోసం బ్రూక్లిన్‌ ఒడ్డుకు దాదాపు 20-30 అడుగుల దూరం వరకు వచ్చింది.

కానీ అక్కడ జనం గుంపును చూసి మళ్ళీ వెనక్కి వెళ్లిపోయింది.

దేవర 100 డేస్ సెంటర్ల లెక్క ఇదే.. వామ్మో అన్ని థియేటర్లలో 100 రోజులు ఆడిందా?
ట్రంప్‌కు సిలికాన్ వ్యాలీ సపోర్ట్.. వాళ్లతో కలిసి పనిచేస్తా : భారత సంతతి క్యాపిటలిస్ట్

ఒకవైపు చలి చంపేస్తున్నా, మరోవైపు చీకటి కమ్ముకున్నాక కూడా పటేల్ తన డ్రోన్‌తో బ్రూక్లిన్‌ను కనిపెట్టడం ఆపలేదు.పోలీసులు మంచుపై బరువులు వేసి అది ఎంతవరకు తట్టుకుంటుందో పరీక్షించారు.ఓ పోలీసు నెమ్మదిగా బ్రూక్లిన్‌ దగ్గరకు వెళ్లడంతో అది భయపడి ఒడ్డువైపు పరుగులు తీసింది.

Advertisement

చివరికి ఓ ఇంటి వరండాలో తలదాచుకున్న బ్రూక్లిన్‌ సురక్షితంగా దొరికింది.ఊపిరి పీల్చుకున్నారు అంతా! బ్రూక్లిన్‌ క్షేమంగా ఇంటికి చేరిందని తెలిసాక పటేల్‌ ఆనందానికి అవధుల్లేవు.

“నా కుక్కకు ఇలా జరిగి ఉంటే నేను ఎంతగానో కుమిలిపోయేవాడిని” అని ఎంతో భావోద్వేగంతో అన్నాడు.తన డ్రోన్‌ ఇంత మంచి పనికి ఉపయోగపడటం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని చెప్పాడు.

సాంకేతిక పరిజ్ఞానం, మానవత్వం కలిస్తే అద్భుతాలు చేయొచ్చని ఈ ఘటన మరోసారి నిరూపించింది.

తాజా వార్తలు