పునీత్ రాజ్ కుమార్ చివరి చిత్రం నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్.. చూసారా?

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గతేడాది అక్టోబర్ 29వ తేదీ గుండెపోటు రావడంతో ఆకస్మికంగా మరణించారు.

ఈయన మృతి కేవలం కన్నడ సినీ అభిమానులకు మాత్రమే కాకుండా యావత్ సినీ ప్రేమికులను కలచివేసింది.

ఈయన మరణించి సుమారు మూడు నెలలు కావస్తున్న ఇప్పటికీ ఆయన మరణ వార్తను అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.ఎంతో మంచి జీవితం ఉన్న నటుడు ఇలా అర్ధాంతరంగా మృతి చెందడం సినీ ఇండస్ట్రీకి తీరని లోటని చెప్పవచ్చు.

Puneeth Rajkumar James Movie-army Officer Look-released Punith Raj Kumar, Kolly

ఈ క్రమంలోనే పునీత్ రాజ్ కుమార్ చివరిసారిగా జేమ్స్ అనే చిత్రంలో నటించారు.ఈ సినిమా మార్చి 17వ తేదీ విడుదల చేయడం కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు.

ఇదిలా ఉండగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా నుంచి రాజ్ కుమార్ కి సంబంధించిన స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు.ఇందులో పునీత్ సైనికుడి గెటప్ లో ఉండటంతో ఈ పోస్టర్ ప్రతి ఒక్క ప్రేక్షకుడిని విపరీతంగా ఆకట్టుకుంది.

Advertisement

చేతన్ కుమార్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాని మార్చి 17 వ తేదీ విడుదల చేయనున్నారు.మార్చి 17వ తేదీ పునీత్ రాజ్ కుమార్ జయంతి కావడంతో ఈ సందర్భంగా ఆయన నటించిన జేమ్స్ సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేయడంతో డిస్ట్రిబ్యూటర్లు మొత్తం మార్చి 17 నుంచి 23వ తేదీ వరకు ఏ సినిమాలను విడుదల చేయకూడదని డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అదే విధంగా ఈ సినిమా కేవలం కన్నడలో మాత్రమే కాకుండా తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు