సక్సెస్ అయిన పంచ్ ప్రసాద్ సర్జరీ... ఏపీ సీఎం జగన్ కు రుణపడి ఉంటానంటూ ఎమోషనల్!

జబర్దస్త్ కార్యక్రమం( Jabardasth ) ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని వరుస పంచ్ డైలాగులతో అందరిని నవ్వించినటువంటి వారిలో కమెడియన్ పంచ్ ప్రసాద్(Punch Prasad) ఒకరు.

జబర్దస్త్ కార్యక్రమంలోనూ అలాగే ఇతర బుల్లితెర కార్యక్రమాలలో కమెడియన్గా కొనసాగుతున్నటువంటి ప్రసాద్ గత కొంతకాలంగా రెండు కిడ్నీలు ఫెయిల్(Kidney Failure) అవ్వడంతో ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.

అయితే సర్జరీ చేయించుకోవడానికి డబ్బులు లేక డయాలసిస్ తో ఇన్ని రోజులు కాలం వెళ్ళదీశారు.ఇక ఈయన ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు క్షీణించడంతో సర్జరీ తప్పనిసరి అని వైద్యులు సూచించారు.

ఈ విధంగా తప్పనిసరిగా సర్జరీ చేయించుకోవాలని చెప్పడంతో అంత డబ్బు తమ వద్ద లేకపోవడంతో నూకరాజు(Nookaraju)ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తూ తనకు సహాయం చేయాలి అంటూ కోరారు ఈ క్రమంలోనే ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి(Venu Swamy) కూడా ఈయన సర్జరీ కోసం ఏకంగా లక్ష రూపాయలు సహాయం చేశారు.అలాగే తోటి ఆర్టిస్టులు కూడా ముందుకు వచ్చారు.జబర్దస్త్ కార్యక్రమంలో జడ్జిగా కొనసాగినటువంటి రోజా(Roja)ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) దృష్టికి తీసుకువెళ్లారు.

ఇలా ఆరోగ్య పరిస్థితి గురించి జగన్మోహన్ రెడ్డికి తెలియచేయడంతో ఏపీ సర్కార్ ప్రసాద్ సర్జరీకి సరిపడా నిధులను మంజూరు చేసింది.ఇలా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఈయనకు నిధులు రావడంతో యశోద హాస్పిటల్ లో ఈయనకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీ పూర్తి అయిందని ప్రస్తుతం ఈయన ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగానే ఉందని త్వరలోనే తాను మీ ముందుకు రాబోతున్నారు అంటూ ప్రసాద్ భార్య సునీత తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసాద్ ఆరోగ్యం గురించి అలాగే తనకు జరిగిన సర్జరీ గురించి తెలియజేశారు.అదేవిధంగా ప్రసాద్ సర్జరీ కోసం సహాయం చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.

Advertisement

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తాము అరుణపడి ఉంటామంటూ ఈ సందర్భంగా ఎమోషనల్ అయ్యారు.

ఉదయం సమయంలో ఖాళీ కడుపుతో తీసుకోవాల్సిన ఆహారాలు ఇవే..!
Advertisement

తాజా వార్తలు