తెలుగు రాష్ట్రాల్లో 'పొన్నియన్ సెల్వన్' అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నాయంటే?

కోలీవుడ్ లో ఇప్పటి వరకు 100 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ సినిమాలు రాలేదు.

అయితే ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీ నుండి కూడా ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ వస్తుంది.

అదే పొన్నియన్ సెల్వన్. ఈ సినిమాను తమిళ్ బాహుబలి అంటూ అక్కడి మీడియా ప్రచారం చేస్తుంది.

ఈ సినిమా బాహుబలి రేంజ్ లో ఉంటుంది అని రెండు పార్టులు కలిసి బాహుబలి కలెక్షన్స్ ను బీట్ చేస్తుంది అంటూ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమాపై కొద్దిగా అంచనాలు అయితే ఏర్పడ్డాయి.ఈ సినిమాను మావెరిక్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్నాడు.

ఈయన డ్రీమ్ ప్రాజెక్ట్ అయినా ఈ సినిమాను ఎప్పటి నుండో తెరకెక్కించాలి అని అనుకున్న ఇప్పటికి అది సాధ్యం అయ్యింది.ఈ సినిమాలో చియాన్ విక్రమ్, హీరో కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్య రే, శోభిత దూళిపాళ్ల వంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement

ఈ సినిమాపై హైప్ ఏర్పడడంతో అందరు ఎలా ఉండబోతుందా అని ఎదురు చూస్తున్నారు.ఇక ఈ సినిమా ఈ నెల 30న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రొమోషన్స్ కూడా జోరుగా చేస్తున్నారు.

పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.ఇక మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా చాలా గ్రాండ్ గా ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది.ఈ నేపథ్యంలోనే ఇక్కడ కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.

మరి ఈ అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నాయి అంటే.చాలా స్లోగా అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయని తెలుస్తుంది.

మరి రిలీజ్ తర్వాత మౌత్ టాక్ బాగుంటేనే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ రాబట్టగలదు.ఏ మాత్రం అటు ఇటు అయినా ఈ సినిమా భారీ నష్టాలను చవి చూడక తప్పదు.

Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...
Advertisement