Prithviraj Sukumaran Prabhas : ప్రభాస్ లాంటి వాళ్ళను అసలు సాయం అడగకూడదు: పృథ్వీ రాజ్ సుకుమారన్

సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకు ఉన్నటువంటి పృథ్వీ రాజ్ సుకుమారన్ ( Prithviraj Sukumaran ) ఇటీవల తెలుగులో కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఈయన ప్రభాస్(Prabhas ) తో కలిసిన నటించిన సలార్ ( Salaar )సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమాలో వీరిద్దరికి ఎంతో ప్రాణ స్నేహితులుగా సందడి చేసిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ సినిమా తరువాత వీరిద్దరూ నిజ జీవితంలో కూడా అంతే మంచి స్నేహితులుగా మారిపోయారు.

ఇలా ప్రభాస్ తో స్నేహం గురించి పృథ్వీ రాజ్ పలు సందర్భాలలో వెల్లడించారు.

Pruthvi Raj Sukumaran Comments Goes Viral About Prabhas

ఇకపోతే ఈయన మలయాళంలో నటించినటువంటి ఆడు జీవితం ( Aadujeevitham ) అనే సినిమా తెలుగులో కూడా విడుదల కావడానికి సిద్ధమవుతుంది.ఈ సినిమా మార్చ్ 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో పృథ్వీ రాజ్ తెలుగులో కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలోనే ఇటీవల ఒక మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి ఈయనకు మీడియా వారి నుంచి ఒక ప్రశ్న ఎదురయింది.

Pruthvi Raj Sukumaran Comments Goes Viral About Prabhas
Advertisement
Pruthvi Raj Sukumaran Comments Goes Viral About Prabhas-Prithviraj Sukumaran Pr

మీరు ప్రభాస్( Prabhas ) ఎంతో మంచి స్నేహితులు ఈ సినిమా ప్రమోషన్ల కోసం ప్రభాస్ ని తీసుకువస్తే సరిపోయేది కదా అనే ప్రశ్న ఈయనకు ఎదురు కావడంతో ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ.నేను అడిగితే ప్రభాస్ నాకు నో చెప్పడు.చెప్పలేడు.

అలా నో చెప్పలేని వారిని ఎప్పుడూ కూడా సాయం అడగకూడదు.అది చాలా తప్పు అంటూ ఈ సందర్భంగా పృథ్వీ రాజ్ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియా( Social Media )లో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈయన ఇదివరకు ప్రభాస్ గొప్పదనం గురించి ఆయనతో స్నేహం చేస్తే ఎలా ఉంటుందనే విషయాల గురించి కూడా ఎంతో గొప్పగా చెప్పిన సంగతి తెలిసిందే.

హీరో హీరోయిన్స్ గా నటించి అన్నాచెల్లెళ్లుగా చేసిన టాలీవుడ్ యాక్టర్స్
Advertisement

తాజా వార్తలు