మొక్కజొన్న పంటను ఆకు ఎండు తెగులు నుండి సంరక్షించే యాజమాన్య పద్ధతులు..!

మొక్కజొన్న పంట( Corn crop ) ఏడాది పొడవునా ఏ కాలంలో అయినా సాగు చేయవచ్చు.మిగతా పంటలతో పోలిస్తే శ్రమ కాస్త తక్కువే.

ఈ మొక్కజొన్న పంటను వివిధ రకాల చీడపీడల, తెగుళ్ళ ( Pests )నుండి సంరక్షించుకుంటే మంచి దిగుబడి పొందవచ్చు.పైగా మొక్కజొన్న పంటకు అన్ని రకాల నేలలు అనుకూలంగానే ఉంటాయి.

సాధారణ ph ఉండే నేలలు కూడా మొక్కజొన్న సాగుకు పనికి వస్తాయి.

మొక్కజొన్న పంటలు అధిక దిగుబడులు సాధించాలంటే పంట మార్పిడి పద్ధతులను పాటించాలి.పంట మార్పిడి వల్ల దిగుబడి పెరగడంతో పాటు వివిధ రకాల తెగుళ్లు ఆశించే అవకాశం చాలా తక్కువ.రసాయన ఎరువులకు( chemical fertilizers ) కంటే సేంద్రీయ ఎరువులకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.

Advertisement

ఒక ఎకరం పొలానికి 10 టన్నుల పశువుల ఎరువు లేదంటే కంపోస్ట్ ఎరువు వేసి నేలను కలియ దున్ని, కల్టివేటర్తో రెండు లేదా మూడుసార్లు నేల మొత్తం దమ్ము చేసుకోవాలి.ఇక ఖరీఫ్ లో కంటే రబీలో ఎక్కువ దిగుబడి రావడం జరుగుతుంది.

పైగా రబీలో సాగు చేస్తే పంట వేసవికాలంలో చేతికి వస్తుంది కాబట్టి ఎలాంటి పంట నష్టం జరిగే అవకాశం ఉండదు.

ఇక మొక్కల మధ్య 20 సెంటీమీటర్ల దూరం, మొక్కల వరుసల మధ్య 30 సెంటీమీటర్ల దూరం ఉంటే మొక్కలు ఆరోగ్యకరంగా పెరుగుతాయి.ఏవైనా చీడపీడలు లేదంటే తెగుళ్లు ఆశిస్తే వ్యాప్తి ఎక్కువగా ఉండదు.మొక్కజొన్న పంటకు తీవ్ర నష్టం కలిగించే తెగుళ్లను ఆకు ఎండు తెగుళ్లు( Leaf dry pests ) కూడా ఒకటి.

ఈ తెగుళ్లు సోకితే ఆకులు పూర్తిగా ఎండిపోయి ఊహించని నష్టం జరుగుతుంది.కాబట్టి ఒక లీటరు నీటిలో మూడు గ్రాముల కాపర్ ఆక్సి క్లోరైడ్ లేదంటే 2.5 గ్రాముల మాంకోజెబ్ ను కలిపి మొక్కల ఆకులు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.

వైరల్ వీడియో : చిల్లరిచి ఐఫోన్ కొన్న బిచ్చగాడు
Advertisement

తాజా వార్తలు