థియేటర్లు తెరుచుకున్న ఓటీటీ వైపు మొగ్గు చూపుతున్న నిర్మాతలు.... కారణం ఏమిటంటే?

గత రెండు సంవత్సరాల నుంచి కరోనా కారణం వల్ల థియేటర్లు మూత పడటంతో ఎన్నో సినిమాలు ఓటీటీలో విడుదలవుతూ ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని పంచుతున్నాయి.

ఈ క్రమంలోనే చిన్న సినిమాలు మాత్రమే కాకుండా భారీ బడ్జెట్ చిత్రాలు కూడా ఓటీటీలో విడుదలయ్యాయి.

అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా ఆంక్షలు తీసి వేయడంతో థియేటర్లు కూడా 100% ఆక్యుపెన్సీతో సినిమాలు విడుదల అవుతున్నాయి.ఈ క్రమంలోనే ఇప్పటివరకు విడుదలకు నోచుకోని భారీ బడ్జెట్ చిత్రాలు వరుసగా విడుదల కానున్నాయి.

ఈ విధంగా సినిమా థియేటర్ లో ఓపెన్ అయినప్పటికీ మలయాళంలో మాత్రం నిర్మాతలు థియేటర్లో సినిమాలను విడుదల చేయకుండా ఓటీటీల వైపు మొగ్గు చూపుతున్నారు. మోహన్ లాల్ వంటి స్టార్ హీరోలు నటించిన సినిమాలు సైతం థియేటర్లో కాకుండా ఓటీటీలో విడుదల చేయడానికి నిర్మాతలు ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ విధంగా స్టార్ హీరోల సినిమాలు కూడా ఓటీటీలో విడుదల చేయడం వెనక ఓ పెద్ద కారణం ఉందని చెప్పవచ్చు.

Producers Leaning Towards Ott When Theaters Open What Is The Reason , Producers
Advertisement
Producers Leaning Towards Ott When Theaters Open What Is The Reason , Producers

టాలీవుడ్ బాలీవుడ్ చిత్ర పరిశ్రమలతో పోలిస్తే మలయాళ చిత్ర పరిశ్రమ చాలా చిన్నది ఇక్కడ స్టార్ హీరోల సినిమాలు కూడా 25 నుంచి 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.ఇక ఈ సినిమాలను డిజిటల్ రైట్స్ పొందడం కోసం ప్రముఖ ఓటీటీ సమస్థలు ఇదే రేంజ్ లో కొనుగోలు చేయడం వల్ల మలయాళం నిర్మాతలు వారి సినిమాలను థియేటర్లలో విడుదల చేయడం కన్నా ఓటీటీలో విడుదల చేయడమే మంచిదని భావించి ఓటీటీల వైపు మొగ్గు చూపుతున్నారు.ఒకవేళ ఈ సినిమాని థియేటర్లో వదిలితే హిట్ టాక్ వచ్చినప్పుడే కలెక్షన్లు వస్తాయి లేదంటే ఆ సినిమా కలెక్షన్ల పరంగా కూడా దెబ్బతింటుంది.

కానీ అదే సినిమాని ఓటీటీలో విడుదల చేస్తే నిర్మాతలకు ఏ విధమైనటువంటి నష్టం ఉండదు కనుక నిర్మాతలు థియేటర్ విడుదల కన్నా ఓటీటీలో విడుదలకే మొగ్గు చూపుతున్నారని చెప్పవచ్చు.

Advertisement

తాజా వార్తలు