కాంతార ఓటీటీ విడుదలపై క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు... విడుదలయ్యేది అప్పుడేనా?

దేశవ్యాప్తంగా కాంతార సినిమా పేరు పెద్ద ఎత్తున మారుమోగిపోతుంది.

కన్నడ హీరో రిషబ్ శెట్టి హీరోగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని భాషలలో విడుదల అయ్యి ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

కన్నడ చిత్ర పరిశ్రమలో సెప్టెంబర్ 30వ తేదీ విడుదలైన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాని పలు భాషలలో విడుదల చేశారు.ప్రతి ఒక్క భాషలోనూ ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకొని ఎంతోమంది సినీ ప్రముఖుల చేత ప్రశంసలు అందుకుంటుంది.

ఈ విధంగా థియేటర్లో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమాని డిజిటల్ మీడియాలో చూడటం కోసం ప్రేక్షకులు కూడా ఎంతో అద్భుతంగా ఎదురుచూస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు సోషల్ మీడియాలో ఈ సినిమా ఓటీటీ విడుదల గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

నవంబర్ 4వ తేదీ ఈ సినిమా ఓటీటీలో విడుదల కాబోతుందని తెలియడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.

Producers Have Given Clarity On The Release Of Kantara Ott Is It Going To Be Rel
Advertisement
Producers Have Given Clarity On The Release Of Kantara Ott Is It Going To Be Rel

ఈ క్రమంలోనే ఈ సినిమా ఓటీటీ విడుదల విషయంపై నిర్మాతలు స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.ఈ సందర్భంగా నిర్మాత కార్తీక్ గౌడ ఈ సినిమా ఓటీటీ విడుదల గురించి మాట్లాడుతూ.కాంతార సినిమా ఓటీటీలో విడుదల కాబోతుందని వచ్చే వార్తలలో ఏ మాత్రం నిజం లేదు.

ఈ సినిమా ఇప్పుడప్పుడే డిజిటల్ మీడియాలో ప్రసారం కాదని, ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాల్సి వస్తే ఆ విషయాన్ని తామే స్వయంగా ప్రకటిస్తాము అంటూ ఈ సందర్భంగా నిర్మాతలు కాంతార సినిమా ఓటీటీ విడుదల గురించి క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు కాస్త నిరుత్సాహం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు