Producer chittibabu Ntr Anr: ఆ విషయంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ గ్రేట్.. ఇప్పటి స్టార్ హీరోలకు చేత కాదా?

సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ టాలీవుడ్ ఇండస్ట్రీకి రెండు కళ్లు అని చాలామంది భావిస్తారు.

ప్రముఖ టాలీవుడ్ నటుడు, నిర్మాత చిట్టిబాబు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

సీనియర్ ఎన్టీఆర్ సొంత సినిమాలన్నీ హైదరాబాద్ లో తీస్తానని స్థలం కొని రామకృష్ణా స్టూడియోస్ కట్టి అక్కడ షూట్ చేశారని చిట్టిబాబు అన్నారు.ఏఎన్నార్ గారు తన సినిమాలన్నీ హైదరాబాద్ లోనే షూట్ చేయాలని మద్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చారని చిట్టిబాబు పేర్కొన్నారు.

అలా ఇద్దరు హీరోలు తొలి అడుగులు వేశారని చిట్టిబాబు పేర్కొన్నారు.మనం ప్రేక్షకుల డబ్బులు తింటున్నామని ఏపీలో కూడా ఫిల్మ్ ఇండస్ట్రీని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చిట్టిబాబు అన్నారు.

టాలీవుడ్ స్టార్ హీరోలు ఈ దిశగా అడుగులు వేయాల్సి ఉన్నా వేయడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.నిర్మాతలు, హీరోలు ఒక అడుగు ముందుకు వేయాల్సి ఉందని ఆయన అన్నారు.

Advertisement
Producer Chittibabu Shocking Comments About Ntr And Anr Details, Ntr, Anr, Produ

హీరోలు ఒక సినిమాను ఇక్కడ మరో సినిమాను అక్కడ షూట్ చేస్తే బాగుంటుందని ఆయన చెప్పుకొచ్చారు.

Producer Chittibabu Shocking Comments About Ntr And Anr Details, Ntr, Anr, Produ

ఈ విధంగా చేయడం ద్వారా ఏపీలో ఉన్న టాలెంట్ ను వాడుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చిట్టిబాబు అన్నారు.ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధి కోసం సినిమా సెలబ్రిటీలు అడుగులు వేస్తే ఏపీ ప్రభుత్వంను అడిగే ఛాన్స్ అయితే ఉంటుందని ఆయన వెల్లడించారు.

Producer Chittibabu Shocking Comments About Ntr And Anr Details, Ntr, Anr, Produ

వైజాగ్ రావాలని జగన్ కోరారని కానీ ఎవరూ రాలేదని ఆయన పేర్కొన్నారు.ఎన్టీఆర్ ఏఎన్నార్ మద్రాస్ నుంచి హైదరాబాద్ కు వచ్చినట్టుగా ఇప్పటి స్టార్ హీరోలు అడుగులు వేయలేదని ఆయన కామెంట్లు చేశారు.ఔట్ డోర్ సెట్ వేసి సినిమాలు ఏపీలో వేస్తే బాగుంటుందని ఆయన పేర్కొన్నారు.

పోసాని ఇండస్ట్రీ నుంచి ఒక అడుగు ముందుకు వేస్తాడని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.

వినాయకుడి శరీరం ఇన్నింటికి సంకేతమా?
Advertisement

తాజా వార్తలు