ప్రజా పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం

యాదాద్రి జిల్లా:ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తే ప్రజా పోరాటాల ద్వారానే వాటికి పరిష్కారం లభింస్తుందని సీపీఐ రాష్ట్ర ఇంచార్జీ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి అన్నారు.

శుక్రవారం సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామంలోని ఎస్విఎల్ ఫంక్షన్ హాల్ లో జరిగిన సీపీఐ 13వ,మండల మహాసభలకు ఆయన ముఖ్యాతిథిగా హాజరై మాట్లాడుతూ సమస్యలు వచ్చినప్పుడు ప్రజా పోరాటాలు నిర్వహించి సాధించినప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు.

అదేవిధంగా నిరంతరం ప్రజలతో మమేకమై ప్రతి సమస్యపై స్పందించే ఒకే ఒక్క పార్టీ సిపిఐ పార్టీ అని అన్నారు.కేంద్రంలో బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ పరిపాలన చేస్తుందని,మళ్లీ పేద ప్రజలపై భారం మోపుతూ మరోసారి గ్యాస్ ధర పెంచి భారం మోపారని,అలాగే రాష్ట్రంలోని టిఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేస్తున్న మంత్రులు సైతం భూ కబ్జాలకు పాల్పడుతూ భూములను అన్యాక్రాంతం చేస్తున్నారని విమర్శించారు.

అదేవిధంగా రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న రాచకొండ భూములను హరిజన,గిరిజన,బంటు,బోయ తదితర సామాజిక వర్గాలు తరాల నుండి సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాయని,ఆ భూములకు ప్రభుత్వం డిజిటల్ పాస్ బుక్ లను వెంటనే ఇచ్చి రైతుబంధు, బ్యాంకు రుణాలు,ఇచ్చే విధంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ ప్రాంతంలో ప్రాజెక్టులు నిర్మించిన భూముల్లో భూనిర్వాసితు రైతులకు ఇంకా కొందరికి నష్టపరిహారం పూర్తిగా అందలేదని,ఆ రైతులకు కూడా తక్షణమే నష్టపరిహారం చెల్లించి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అనంతరం యాదాద్రి సీపీఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నేటికి నెరవేర్చకుండా పూటకో మాట చెబుతూ దళితులకు 3 ఎకరాల భూమి,డబల్ బెడ్రూమ్ ఇల్లు,ఇవ్వకుండా నేడు పేద ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు.భాస్కర్,కందుల లింగమ్మ అధ్యక్షుతన జరిగిన ఈ మహాసభలను నల్లగొండ జిల్లా సీపీఐ కార్యదర్శి నెల్లికంటి సత్యం ప్రారంభించగా,సిపిఐ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు అరుణ పతాకాన్ని ఎగురవేశారు.

Advertisement

ఈ మహాసభలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి,ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు కె.శ్రీనివాస్,సిపిఐ మండల కార్యదర్శి బచ్చనగోని గాలయ్య,చౌటుప్పల్ మండల కార్యదర్శి పల్లె శేఖర్ రెడ్డి,మండల కార్యవర్గ సభ్యులు వీరమల్ల యాదయ్య,సుర్వీ నరసింహ,కలకొండ సంజీవ,పొట్ట శంకరయ్య,సర్పంచులు పొట్ట సత్యం,కుర్మిద్ద కలమ్మ, సింగిల్ విండో డైరెక్టర్ ముత్యాల అంజయ్య,మహిళా సమాఖ్య మండల అధ్యక్షురాలు మారగోని అనురాధ, మండలంలోని శాఖా కార్యదర్శులు ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Blitz Sécurité Des Joueurs Et Jeu Responsable
Advertisement

Latest Yadadri Bhuvanagiri News