కెనడాలో రెచ్చిపోయిన ఖలిస్తాన్‌ మద్ధతుదారులు.. భారత సంతతి మీడియా ప్రతినిధిపై దాడి

కెనడాలో ఖలిస్తాన్ వేర్పాటువాదులు రెచ్చిపోతున్నారు.ఇప్పటికే భారత వ్యతిరేక కార్యక్రమాలు, రెఫరెండాలు, బెదిరింపులు చేస్తున్న వారు.

తాజాగా కాల్గరీలో భారత సంతతికి చెందిన మీడియా ప్రతినిధిపై దాడి చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.రెడ్ ఎఫ్ఎమ్ కాల్గరీ( Red FM Calgary, ) అనే రేడియో ఛానెల్ న్యూస్ డైరెక్టర్ రిషి నగర్‌పై అల్బెర్టా ప్రావిన్స్‌లో ఆదివారం ఈ దాడి జరిగినట్లుగా సమాచారం .నగరంలోని నార్త్ ఈస్ట్ క్వాడ్రంట్‌లో ఎన్నికలకు సంబంధించిన ఓ ఈవెంట్‌కు హాజరై బయటకు వస్తుండగా నగర్‌పై ఈ దాడి జరిగింది.తాను ఈవెంట్ నుంచి బయటకు వచ్చి నా కారు వైపు వెళ్తుండగా గుర్తు తెలియని దుండగులు దాడి చేశారని ఆయన తెలిపారు.

ఈ ఘటనలో నా ఎడమ కన్ను దెబ్బతిందని, కుడికాలికి గాయమైందని చెప్పారు.

ఖలిస్తాన్ మద్ధతుదారులే తనపై దాడి చేశారని నగర్ ఓ జాతీయ మీడియా సంస్థకు చెప్పాడు.కాల్గరీలోని గురుద్వారా దశ్‌మేష్ కల్చరల్ సెంటర్‌( Gurdwara Dashmesh Cultural Centre )లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు ఇండో కెనడియన్లను అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు.అరెస్ట్ అయిన వారిని గుర్సేవక్ సింగ్, సుఖ్‌ప్రీత్ సింగ్‌లుగా గుర్తించినట్లుగా కాల్గరీ పోలీస్ ప్రతినిధి రెడ్ ఎఫ్‌కి తెలియజేశారు.

Advertisement

వీరిపై బెదిరింపులు, శారీరక హాని కలిగించడం వంటి అభియోగాలు మోపినట్లుగా వెల్లడించారు.

ఇదిలాఉండగా.ఖలిస్తాన్ వేర్పాటువాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Singh Nijjar ) హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నలుగురు భారతీయుల కేసు విచారణ మళ్లీ వాయిదా పడింది.సర్రే ప్రొవిన్షియల్ కోర్ట్ న్యాయమూర్తి జోడీ హారిస్.

ఈ కేసును నవంబర్ 21కి వాయిదా వేస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.నిజ్జర్ కేసులో విచారణ ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు ఇది ఐదవసారి వాయిదా.

కరణ్ బ్రార్ (22), కమల్ ప్రీత్ సింగ్ (22), కరణ్ ప్రీత్ సింగ్ (28), అమన్‌దీప్ సింగ్ (22)లను నిజ్జర్ కేసులో కెనడా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

చిరు నాగ్ వెంకీలలో బాలయ్యకు ఇష్టమైన హీరో ఎవరో తెలుసా?
Advertisement

తాజా వార్తలు