అమర్ ని నామినేట్ చేసి పల్లవి ప్రశాంత్ కి సపోర్ట్ చేసిన ప్రియాంక..క్లైమాక్స్ వీక్ ట్విస్టులు మామూలుగా లేవు!

ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ ( Bigg Boss House )లో కంటెస్టెంట్స్ రెండు గ్రూప్స్ గా విడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే.

స్పై మరియు స్పా గ్రూప్స్ గా సోషల్ మీడియా లో నెటిజెన్స్ పిలుస్తున్నారు.

స్పై అంటే శివాజీ, ప్రశాంత్ మరియు యావర్.స్పా అంటే శోభా, ప్రియాంక( Shobha, Priyanka ) మరియు అమర్.

మొదటి నుండి ఈ రెండు గ్రూప్స్ కలిసి కట్టుగా ఉంటున్నారు.కానీ గత వారం ప్రియాంక మరియు అమర్ మధ్య చిన్న మనస్పర్థలు ఏర్పడ్డాయి.

టికెట్ టు ఫినాలే టాస్కు లో ఎవరి స్నేహితులకు వాళ్ళు సపోర్టు చేసుకుంటూ పాయింట్స్ ఇచ్చుకున్నారు.కానీ అమర్ కి మాత్రం మొదటి వారం నుండి క్లోజ్ గా ఫ్రెండ్ గా చెప్పుకొని తిరుగుతున్న ప్రియాంక మాత్రం ఇవ్వలేదు.

Advertisement

అందరూ ఒక్కసారిగా షాక్ కి గురి అయ్యారు.శివాజీ బ్యాచ్ అయితే అమర్ ని చూసి నవ్వుకున్నారు.

అయితే కీలకమైన సమయం లో అమర్ కి తన స్నేహితురాలు సహాయం చెయ్యలేదని చాలా బాధపడ్డాడు.పోటీ లో అర్జున్ మరియు ప్రశాంత్, అమర్ ( Prashanth, Amar )ని వెంటాడుతూ రావడంతో అమర్ లో భయం రావడం తో ప్రియాంక ని పాయింట్స్ ఇచ్చి ఉంటే బాగుండేది అని అంటూ ఉండేవాడు.దీనికి ప్రియాంక చాలా హర్ట్ అయ్యింది.

తర్వాత గౌతమ్ ని అడిగి ఓడిపోయే పరిస్థితి వస్తే అమర్ కి పాయింట్స్ ఇవ్వు అని చెప్పింది.గౌతమ్ ప్రియాంక చెప్పినట్టుగానే చేస్తాడు.

అలా ఆ సంఘటనలన్నీ గుర్తుపెట్టుకొని ప్రియాంక నేడు అమర్ దీప్ ని నామినేట్ చేసింది.వీళ్లిద్దరి మధ్య కాసేపు వాదనలు నడిచాయి.

ఎన్టీఆర్ నాకన్నా చిన్నోడు... నన్ను మాత్రం ఒరేయ్ అని పిలుస్తాడు : రాజీవ్ కనకాల 
జాక్ మూవీ సెన్సార్ రివ్యూ.. సిద్ధు జొన్నలగడ్డ మరో బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తారా?

చివరికి ప్రియాంక నామినేషన్ ని అంగీకరించి అమర్ దీప్ నామినేట్ అవుతాడు.ఆ తర్వాత హౌస్ లో జరిగిన కొన్ని సంఘటనలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

అదేమిటంటే వాష్ రూమ్ దగ్గర ప్రశాంత్ అమర్ దీప్ మీద చాడీలు ప్రియాంక తో చెప్పడం, దానికి ప్రియాంక కూడా వత్తాసు పలకడం వంటివి అందరినీ ఆశ్చర్యపర్చింది.ముఖ్యంగా అమర్ ఫ్యాన్స్ కి అయితే ప్రియాంక మీద కోపం నషాలం కి అంటింది.వాస్తవానికి వీళ్లిద్దరి మధ్య దీని గురించి చర్చ ముగిసింది.

ఇద్దరు ఒకటి అయిపోయారు కూడా, కానీ ఇప్పుడు నామినేషన్ వెయ్యడానికి కారణం గత వారం నాగార్జున ప్రియాంక గ్రూప్ గేమ్ గురించి మాట్లాడడం వల్లే.ప్రియాంక చాలా స్ట్రాటజీ తో గేమ్ ఆడుతూ పోతుంది, అమర్ మాత్రం పిచ్చి వాడిలాగా అందరినీ నమ్మేస్తున్నాడు అని ఆయన ఫ్యాన్స్ బాధపడుతున్నారు.

తాజా వార్తలు