ఎన్టీఆర్ కి జతగా యమ దొంగ సినిమా లో హీరోయిన్ గా నటించిన ప్రియమణి గుర్తుంది కదా ఆ మధ్య బుల్లి తెర పై తెగ సందడి చేసింది.
వెబ్ సిరీస్ కూడా చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.
ఈ మధ్య కాలం లో ప్రియమణి సినిమా లకు కాస్త దూరంగా ఉంటుంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రియమణి త్వరలోనే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతుందట.
అది కూడా యంగ్ హీరోలకు అమ్మగా.అత్తగా నటించేందుకు ఓకే చెప్పిందని వార్తలు వస్తున్నాయి.
అన్ని వర్గాల వారిని ఆకట్టుకుని ఒకానొక సమయం లో జాతీయ అవార్డు ను సైతం సొంతం చేసుకున్న ప్రియమణి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టబోతున్న నేపథ్యం లో అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతం ప్రియమణి కి సంబంధించిన సినిమాలు లేక పోవడంతో ఆమె కెరియర్ కి ఫుల్ స్టాప్ పెట్టిందని అంతా భావిస్తున్నారు, కానీ ఆమె పెట్టింది ఫుల్ స్టాప్ కాదని కేవలం కామ మాత్రమే అని త్వరలోనే తెలియబోతుంది.అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రియమణి మరింత బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.ఈ మధ్య కాలం లో సీనియర్ హీరోయిన్స్ కి అమ్మగా అత్తగా అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయి, అందుకే ప్రియమణి ఈ నిర్ణయం తీసుకుని ఉంటుంది.
అయితే ఇప్పటి వరకు ఈ విషయమై ప్రియమణి నుండి కానీ ఆమె సన్నిహితుల నుండి కానీ ఎలాంటి అధికారిక క్లారిటీ రాలేదు.త్వరలోనే ప్రియమణి కొత్త సినిమా కన్ఫమ్ ఐతే, అప్పుడు ఈ విషయం పై క్లారిటీ వస్తుందేమో చూడాలి.గతంలో తెలుగు తో పాటు హిందీ.
తమిళం సినిమా ల్లో వరుసగా నటించిన ముద్దుగుమ్మ ప్రియమణి ముందు ముందు కూడా అన్ని భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy