మహేష్ రాజమౌళి మూవీలో యాక్ట్ చేయడానికి భయం.. సలార్ నటుడు కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) అలాగే దర్శకదీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli)కాంబినేషన్ లో త్వరలోనే ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.

అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించనున్నారు.

ఈ సినిమాను హాలీవుడ్ స్థాయిలో నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాకముందే ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి.

వీలైనంత తొందరగా ఈ సినిమా పనులు పూర్తిచేసి షూటింగ్ ను మొదలు పెట్టాలని భావిస్తున్నారు డైరెక్టర్ రాజమౌళి.ఈ సినిమా అప్పుడప్పుడు మొదలవుతుందా అని అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

అయితే జనవరిలో అధికారకంగా ప్రారంభమైన విషయం తెలిసిందే.సినిమా షూటింగ్ మొదలైంది అన్నమాట కానీ ఎలాంటి అప్డేట్ లేదు.ఇంకా ఈ సినిమాలో ప్రియాంక చోప్రా(Priyanka Chopra) హీరోయిన్గా నటిస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement

ఇది ఇలా ఉంటే మలయాళ సూపర్ స్టార్ లలో ఒకరైన నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran)ఇంస్టాగ్రామ్ వేదికగా తాజాగా ఒక పోస్ట్ చేశారు.దర్శకుడిగా నా చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తి చేశాను.

వాటికి సంబంధించిన బిజినెస్ అండ్ మార్కెటింగ్ పనులు కూడా పూర్తయ్యాయి.

ఇక నటుడుగా తెరపై కనిపించడానికి సిద్ధమవుతున్నాను.ఇందుకు సంబంధించి ఒక పరభాషా చిత్రంలో నటించనున్నాను.ఆ మూవీలో పెద్ద పెద్ద డైలాగులు ఉండబోతున్నాయి.

కొంచం భయంగా కూడా ఉందంటూ పోస్ట్ చేసాడు.పృథ్వీ రాజ్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!

దాంతో పృథ్వీరాజ్ రాజమౌళి మహేష్ బాబు ప్రాజెక్ట్ ని ఉద్దేసించి ఇలాంటి కామెంట్స్ చేస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి.సలార్ లో ప్రభాస్ తో కలిసి పృథ్వీ రాజ్ బాగా నటించిన విషయం తెలిసిందే.

Advertisement

సలార్ తర్వాత ఆయనకున్న క్రేజ్ భారీగా పెరిగింది.దీంతో మహేష్ బాబు నటించిన బోయే సినిమాలో కూడా బాగం అవుతున్నట్టు తెలుస్తోంది.

తాజా వార్తలు