Prabhas Prithviraj Sukumaran : స్టార్ హీరో ప్రభాస్ కు తన స్థాయి ఏంటో తెలియట్లేదు.. పృథ్వీరాజ్ సుకుమారన్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ హీరో ప్రభాస్( Tollywood Hero Prabhas ) ఇటీవల సలార్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన తెలిసిందే.

భారీ అంచనాల నడుమ విడుదలైన సలార్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఇకపోతే సలార్ సినిమా పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే రెండే రెండు క్యారెక్టర్స్ ఒకటి ప్రభాస్ రెండోది వరదరాజ మన్నార్‌.ఎందుకంటే ఈ పాత్రను అంత అద్భుతంగా చేశారు మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్( Malayalam Hero Prithviraj Sukumaran ). ప్రభాస్ పృథ్వీరాజ్ ఆన్ స్క్రీన్ ఫ్రెండ్‌ఫిష్‌ కి అయితే ఆడియన్స్ ఫిదా అయిపోయారు.అయితే ఈ సినిమా తర్వాత ఆఫ్‌స్క్రీన్‌ లో కూడా వీళ్లిద్దరూ అంతే గొప్ప స్నేహితులు అయి పోయారు.

Prithviraj Sukumaran Interesting Comments On Prabhas In His Latest Interview

ఈ విషయాన్ని చాలా సార్లు పృథ్వీరాజ్ కూడా చెప్పారు.ఇది ఇలా ఉంటే తాజాగా తన కొత్త సినిమా ఆడుజీవితం ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్‌తో తన స్నేహం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు పృథ్వీరాజ్.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.

ప్రభాస్‌ తో సలార్( Salaar ) కోసం కలిసి పని చేసిన తర్వాతే మా స్నేహం మొదలైంది.నిజానికి ప్రభాస్ గురించి మీకు తెలిస్తే తనతో స్నేహం చేయకుండా ఉండటం అసాధ్యం.

Advertisement
Prithviraj Sukumaran Interesting Comments On Prabhas In His Latest Interview-Pr

అతను చాలా స్వీట్.ఎప్పుడూ చాలా కూల్‌గా ఉంటాడు.

Prithviraj Sukumaran Interesting Comments On Prabhas In His Latest Interview

ప్రభాస్ నుంచి నేను నేర్చుకున్న ఒక విషయం ఏంటంటే అతను దేశంలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్‌( Biggest Superstars )లో ఒకడు, కానీ దాని గురించి అస్సలు పట్టించుకోడు.నిజానికి తన లెవల్ ఏంటో ప్రభాస్‌కే తెలీదు అని పృథ్వీరాజ్ సుకుమారన్ చెప్పుకొచ్చారు.ఈ సందర్భంగా పృథ్వీరాజు చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రభాస్ అభిమానులు ఆ కామెంట్లపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు