అమర్ దీప్ తో కొట్లాటకు దిగిన ప్రిన్స్ యావర్..రతికా వల్ల రణరంగంగా మారిపోయిన బిగ్ బాస్!

ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో ది రియల్ గేమ్ చేంజర్ అంటే అది రతికా( Rathika Rose ) అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టినప్పుడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ గేమ్ ని నాశనం చెయ్యడానికి చాలా ప్రయత్నాలే చేసింది.

ప్రశాంత్ ఆమె మాయలో పడి చాలా వరకు ఫోకస్ తప్పుతూ వచ్చాడు.కానీ ఆమె మాయలో నుండి చాలా తొందరగానే బయట పడ్డాడు కాబట్టే ఈరోజు బిగ్ బాస్ హౌస్ లో ఇంకా టాప్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్నాడు.

పల్లవి ప్రశాంత్ తర్వాత బిగ్ బాస్ హౌస్ లో మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరు అంటే అది యావర్ అనే చెప్పాలి.మొదటి వారం నుండి యావర్ ఆడిన గేమ్ కి రతికా రీ ఎంట్రీ తర్వాత యావర్ గేమ్ కి చాలా తేడా ఉంది.

రతికా చెప్పుడు మాటలు విని తన గేమ్ ని సర్వ నాశనం చేసుకుంటున్నాడు యావర్.

Advertisement

ఉదాహరణ కి నిన్న జరిగిన నామినేషన్స్ ప్రక్రియ ని ఒకసారి పరిగణలోకి తీసుకోవాలి.అమర్ దీప్ రతికా తో యావర్ నీతో హైప్ కోసమే తిరుగుతున్నాడు.నువ్వు అతని మాయలో పడొద్దు, నీ గేమ్ నువ్వు ఆడు అని అన్నాడని యావర్ కి చెప్పింది.

ఆ పాయింట్ ని పట్టుకొని యావర్ ఇప్పుడు నామినేట్ చేసాడు.ఆమె 5 వ వారం లో చెప్పిన పాయింట్ ని తీసుకొచ్చి, యావర్ 11 వ వారం లో చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఈ ఆరు వారాల్లో ఎన్నో సమీకరణాలు మారాయి.భద్ర శత్రువులుగా కొట్టుకుంటున్న ప్రశాంత్ మరియు అమర్ దీప్ గత వారం నుండి మంచి స్నేహితులు అయిపోయారు.ఇలా ఎన్నో సమీకరణాలు మారాయి, అలాంటి సమయం లో అప్పటి కారణాలను తీసుకొచ్చి ఇప్పుడు నామినేట్ చెయ్యడం చాలా సిల్లీ గా అనిపించింది.

నామినేషన్స్ పాయింట్స్ లేకపోయినా కూడా అమర్ దీప్( Amardeep ) మీద అసూయ తో నామినేట్ చెయ్యడానికే యావర్ చూస్తున్నట్టు అందరికీ అర్థం అయ్యింది.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..

ఇదే ఇప్పుడు యావర్ గేమ్( Prince yawar ) ని దెబ్బ తీస్తుంది.ఇకపోతే ఈరోజు అమర్ దీప్ ని కొట్టడానికి ముందుకు పోవడం, అమర్ దీప్ ఏమిరా కొడతావా అని అంటే హా కొడతాను.నీకు అదే కావాలి.

Advertisement

బిగ్ బాస్ ని అడుగు ఇస్తాను అని యావర్ అంటాడు.అంటే బిగ్ బాస్ ఒప్పుకుంటే కొట్టేస్తావ్ అన్నమాట అని అమర్ దీప్ అనగా, హా కచ్చితంగా అని అంటాడు యావర్.

వాస్తవానికి అక్కడ కొట్టుకునేంత పెద్ద కారణాలు అసలు ఏమి లేవు, కేవలం ఈ సీన్ లో యావర్ కి అమర్ దీప్ మీద ఉన్న అసూయ మరియు పగనే కనిపించింది.దీనిపై సోషల్ మీడియా లో ఇప్పుడు పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంది.

తాజా వార్తలు