ఇవాళ కామారెడ్డిలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం..!

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో తెలంగాణలో బీజేపీ ప్రచారాన్ని హోరెత్తిస్తుంది.ఈ మేరకు జాతీయ నేతల పర్యటనతో ప్రచారం పీక్స్ కు చేరింది.

ఈ క్రమంలోనే ఇవాళ మరోసారి తెలంగాణలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.మొత్తం మూడు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించనున్న మోదీ పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు.

కాసేపటిలో హకీంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న మోదీ ముందుగా కామారెడ్డికి వెళ్లనున్నారు.మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో మోదీ సభ జరగనుంది.

అక్కడి నుంచి రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గానికి వెళ్లనున్న మోదీ అక్కడి మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభలో పాల్గొననున్నారు.మరోవైపు జేపీ నడ్డా, అమిత్ షాతో పాటు యూపీ సీఎం యోగి ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది.

Advertisement
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 26, శుక్రవారం, కార్తీక మాసం, 2021

తాజా వార్తలు