Wheat Crop : గోధుమ పంటను ఆశించే బూజు తెగుళ్లను అరికట్టే పద్ధతులు..!

గోధుమ పంటను( Wheat Crop ) ఆశించి తీవ్ర నష్టం కలిగించే బూజు తెగుళ్లు బూజు బ్లుమెరియ గ్రామినీస్ అనే ఒక ఫంగస్( Fungus ) వల్ల పంటలు ఆశిస్తుంది.చల్లటి తేమతో కూడిన వాతావరణం లో ఈ ఫంగస్ వ్యాప్తి విస్తృతంగా జరుగుతుంది.

16 నుంచి 21 డిగ్రీల మధ్య ఉండే ఉష్ణోగ్రత ఈ ఫంగస్ వ్యాప్తికి చాలా అనుకూలంగా ఉంటుంది.గోధుమ పంట ఏ దశలో ఉన్నప్పుడైనా ఈ బూజు తెగుళ్లు పంటను ఆశించే అవకాశం ఉంది.

ఈ తెగుళ్ల లక్షణాలు గోధుమ మొక్క ఆకులు కాండం కంకుల్లో గుర్తించవచ్చు.తెల్లని మెత్తటి మచ్చల రూపం గోధుమ మొక్కలపై( Wheat Plants ) గమనించవచ్చు.

గోధుమ మొక్కల కణజాలంపై పసుపు క్లోరోటిక్ చిన్న మచ్చలు ఈ బూజు ప్రాంతాల కన్నా ముందుగా ఉద్భవిస్తాయి.ఆ తర్వాత ఆ మచ్చలు బూడిద రంగులోకి మారుతాయి.

Advertisement
Wheat Crop : గోధుమ పంటను ఆశించే బూజు త

మరి ఈ బూజు తెగుళ్లు గోధుమ పంటను ఆశించకుండా ఉండాలంటే తెగులు నిరోధక, తెగులను తట్టుకునే మేలు రకం విత్తనాలను( Seeds ) సాగుకు ఎంపిక చేయాలి.

Wheat Crop : గోధుమ పంటను ఆశించే బూజు త

సీజన్లో తొందరపడి ముందుగా విత్తనాలు నాటకూడదు.తేమను( Moisture ) తగ్గించడం కోసం విత్తనాల సాంద్రతను సవరించాలి.నత్రజని ఎరువులు జాగ్రత్తగా ఉపయోగించాలి.

మట్టిలో నత్రజని( Nitrogen ) అధికంగా ఉంటే రోగకారకం పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది.పొలంలో ఈ బూజు తెగుళ్ళను గుర్తించిన తర్వాత వ్యాప్తి జరగకుండా తొలిదశలోనే ఉంటే ఆ మొక్కలను పొలం నుంచి పీకి నాశనం చేయాలి.1:10 నిష్పత్తి లో నీటిని, పాలను కలిపి సంక్రమణ గుర్తులపై చల్లాలి.

Wheat Crop : గోధుమ పంటను ఆశించే బూజు త

ఒకవేళ తెగుళ్ల వ్యాప్తి అధికంగా ఉంటే రసాయన పిచికారి మందులను ఉపయోగించాలి.ఫ్లూట్రిఫాల్, ట్రిటినోజజోల్ లాంటి మందులు ఫంగస్ వ్యాధుల నుంచి గోధుమ పంటను సంరక్షిస్తాయి.ఫెరానిమోల్, టెబోకానాజోల్, సిప్రోకోనజోల్ లాంటి మందులు వివిధ రకాల శిలీంద్రాల నుంచి గోధుమ పంటను సంరక్షిస్తాయి.

సిలికాన్, కాల్షియం సిలికేట్ ఆధారిత మందులు మొక్కకు నిరోధక శక్తిని బలోపితం చేస్తాయి.

Advertisement

తాజా వార్తలు