Premi vishwanath Karthika Deepam : కార్తీకదీపం వల్ల అలాంటి అభిప్రాయం వచ్చిందన్న వంటలక్క.. ఏమైందంటే?

ప్రేమీ విశ్వనాథ్ అంటే ప్రేక్షకులకు గుర్తు పట్టడానికి కొంత సమయం పడుతుంది కానీ కార్తీకదీపం వంటలక్క అంటే మాత్రం ప్రేక్షకులు సులువుగా గుర్తు పడతారు.

ఇప్పటికే ఈ సీరియల్ 1500 ఎపిసోడ్లు పూర్తి చేసుకోవడం గమనార్హం.

ఈ సీరియల్ లో మేకప్ వేసుకుని ప్రేమీ విశ్వనాథ్ డీ గ్లామరస్ గా కనిపిస్తారనే సంగతి తెలిసిందే.అయితే ఒక ఇంటర్వ్యూలో ప్రేమీ విశ్వనాథ్ మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.

నేను ఇండస్ట్రీలోకి 2014 సంవత్సరంలో వచ్చానని అన్నారు.సీరియల్ కోసం బ్లాక్ మేకప్ వేసుకుంటున్నానని ఆమె కామెంట్లు చేశారు.

బ్లాక్ కలర్ అంటే నాకు చాలా ఇష్టమని మొదట మలయాళంలో కరతముత్తు సీరియల్ లో నటించే సమయంలో ఆ రోల్ ఛాలెంజింగ్ రోల్ అని నాకు అనిపించిందని ప్రేమీ విశ్వనాథ్ చెప్పుకొచ్చారు.కార్తీకదీపం సీరియల్ వచ్చిన తర్వాత చాలామంది అమ్మాయిలు కలర్ లో ఏముందని భావిస్తున్నారని ఆమె తెలిపారు.

Advertisement

ఈ సీరియల్ వల్ల కలర్ లేకపోయినా ఏంటి అని సొసైటీలో ఒక టాక్ వచ్చిందని ప్రేమీ విశ్వనాథ్ కామెంట్లు చేశారు.నల్లగా ఉంటే కామెంట్ చేసేవాళ్లు చాలామంది ఉన్నారని ఆమె తెలిపారు.కొంతమంది కలర్ తక్కువగా ఉన్నా చాలా అందంగా ఉంటారని ప్రేమీ విశ్వనాథ్ కామెంట్లు చేశారు.

నేను లీగల్ అడ్వైజర్ గా కూడా పని చేశానని ప్రేమీ విశ్వనాథ్ వెల్లడించారు.ఫ్యామిలీ ఫ్రెండ్ వల్ల కరతముత్తు సీరియల్ లో ఛాన్స్ వచ్చిందని ప్రేమీ విశ్వనాథ్ తెలిపారు.

ప్రేమీ విశ్వనాథ్ రీఎంట్రీ ఇవ్వడంతో ఈ సీరియల్ రేటింగ్స్ మళ్లీ పుంజుకున్నాయి.ఈ సీరియల్ ప్రేమీ విశ్వనాథ్ కెరీర్ లో స్పెషల్ సీరియల్ గా నిలిచిందని కొంతమంది కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo
Advertisement