సికింద్రాబాద్ క్లబ్ కు భర్తతో వెళ్లిన వంటలక్క.. బీర్ ఫోటోలు షేర్ చేస్తూ రచ్చ!

స్టార్ మాలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి అందరికి తెలిసిందే.ఎందుకంటే ఆ సీరియల్ ప్రారంభం నుండి ఓ రేంజ్ లో దూసుకుపోతుంది కాబట్టి.

ఇక ఆ సీరియల్ లో నటించిన వంటలక్క పాత్ర గురించి అందరికీ తెలిసిందే.ఆ సీరియల్ లో దీపను వంటలక్క గా పిలువగా.

ఈ సీరియల్ ప్రేక్షకుల నుండి ఎంతో గుర్తింపు తెచ్చుకుంది.అంతేకాకుండా స్టార్ మాలో ఈ సీరియల్ కు ఉన్న రేటింగ్ అంతా ఇంతా కాదు.

ఇక వంటలక్క అంటే తెలుగు ప్రేక్షకులకు మంచి అభిమానం ఉన్న నటి.ఇక వంటలక్క అసలు పేరు ప్రేమి విశ్వనాథ్. వంటలక్క కేరళకు చెందిన మలయాళ నటి.కార్తీకదీపం సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.అంతే కాకుండా ఈ సీరియల్ తో ఎంతో మంది అభిమానుల మనసులను గెలుచుకుంది.

Advertisement

ఇక ఈ సీరియల్ తో మంచి పాపులారిటీని సంపాదించుకుంది.ఇక వంటలక్క సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.

తెగ ఫోటోలు షేర్ చేస్తూ బిజీగా ఉంటుంది.ఎప్పటికప్పుడు తనను షూట్ చేసుకున్న ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.

అంతేకాకుండా ప్రేమి విశ్వనాథ్ కు మలయాళం లో కూడా అభిమానులు ఎక్కువగా ఉన్నారు.సీరియల్ లో ఉండే వంటలక్క గెటప్ పక్కనపెడితే బయట ఉండే వంటలక్క గెటప్ ను చూసి అందరూ షాక్ అవ్వాల్సిందే.జీన్స్, టాప్స్ వేసి, వెస్ట్రన్ డ్రెస్ లతో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రేమి విశ్వనాథ్ వరుస ప్రాజెక్టులతో బాగా బిజీగా ఉంది.ఓ వైపు కార్తీకదీపం సీరియల్ తో పాటు మరోవైపు తెగ అవకాశాలు అందుకుంటోంది.

How KYC, Fast Payouts And Self‑Exclusion Work For Crypto Users At WPT Global (Canada)
High Roller Tipps & Casino

అయితే వంటలక్క అప్పుడప్పుడు తన భర్తతో కలిసి దిగిన ఫోటోలను కూడా పంచుకుంటుంది.తను ఏదైనా ఈవెంట్ కి వెళ్తే ఆ ఈవెంట్ ఫోటోలను కూడా షేర్ చేస్తుంది.

Advertisement

అయితే తాజాగా వంటలక్క తన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేసుకోగా ప్రస్తుతం అది బాగా వైరల్ అవుతుంది.

ఇంతకు అసలు విషయం ఏంటంటే.ప్రేమి విశ్వనాథ్ తన భర్తతో కలిసి ఒక క్లబ్ కు వెళ్ళినట్లు కనిపించింది.అది కూడా సికింద్రాబాద్ లో ఉన్న ఒక క్లబ్.

అయితే అందులో తను బీర్ సీసాల ఫోటోలు కూడా పంచుకొని బాగా రచ్చ రచ్చ చేసినట్లు కనిపించింది.అయితే ఆ పోస్టులు చూసిన వంటలక్క అభిమానులు. మన వంటలక్క బీరు కూడా తాగుతుందా అంటూ షాక్ అవుతున్నారు.

నీకు ఈ అలవాటు ఎప్పటి నుంచి వచ్చింది అక్క అంటూ.నువ్వు తాగుతున్నావా లేదా బావ తాగుతున్నాడా అని అనుమానాలతో ప్రశ్నలు వేస్తున్నారు.

మొత్తానికి వంటలక్క బీరు ఫోటోలను షేర్ చేయటంతో తన అభిమానులు మాత్రం అయోమయంలో ఉన్నారని చెప్పవచ్చు.

" autoplay>