ఆలోచనలో 'హనుమాన్'.. ముందుకు జరుగనుందా?

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ ఇండియన్ సూపర్ హీరో సినిమా హను - మాన్( Hanu Man ).

ఈ సినిమాలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ( Hero Teja Sajja ) హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ లుగా నటించారు.

ఎలాంటి అంచనాలు లేకుండా తెరకెక్కిన ఈ సినిమాకు ఒక్కో అప్డేట్ రివీల్ చేయడంతో అంచనాలు పెరిగాయి.టీజర్ తో అంచనాలు డబల్ కావడంతో ఈ సినిమా కోసం ఎదురు చూసే ప్రేక్షకులు కూడా ఎక్కువయ్యారు.

అందులోను ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ కావడంతో ఈ సినిమాను పాన్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు.ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కు సిద్ధం అయ్యింది.

మరి కొద్దీ రోజులు మాత్రమే ఉండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసి ఈ మధ్యనే ట్రైలర్ రిలీజ్ చేసింది.ఈ ట్రైలర్ అంచనాలను మరింత పెంచేసింది.ఇంత తక్కువ బడ్జెట్ లో కూడా ఈ రేంజ్ లో విఎఫ్ఎక్స్ చేయవచ్చని ప్రశాంత్ వర్మ నిరూపించాడు.

Advertisement

కాగా ఈ సినిమా గురించి విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

ఈ సినిమా భారీ పోటీ మధ్య సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అవ్వనుందని తెలిపారు.అయితే తాజాగా ఈ సినిమా ఒక రోజు ముందుగానే రిలీజ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నట్టు తెలుస్తుంది.తాజాగా గిల్ట్ లో జరిగిన మీటింగ్ లో గుంటూరు కారం సినిమాతో పోటీ పడే కంటే ఒక రోజు ముందుగా వస్తేనే ఎక్కువ స్క్రీన్స్ దక్కడమే కాకుండా వసూళ్లు కూడా బాగా వస్తాయని నిర్ణయించుకున్నారని టాక్.

ఇందులో నిజమెంతో తెలియాలంటే వేచి చూడాల్సిందే.కాగా ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ ( Varalaxmi Sarathkumar ), వినయ్ రాయ్ లు కీలక పాత్రల్లో నటించగా.

అనుదీప్ దేవ్, హరి గౌర, కృష్ణ సౌరబ్ లు సంగీతం అందిస్తున్నారు.ఇక ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కే నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నాడు.

ఓకే డ్రెస్ ను చాలాసార్లు రిపీటెడ్ గా ధరించిన సెలబ్రిటీస్ వీరే !
Advertisement

తాజా వార్తలు