ప్రశాంత్ నీల్ భవిష్యత్తు నాలుగు సినిమాలివే.. మరో ఆరేళ్ల పాటు డేట్స్ లేనట్టేనా?

స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్( Prashanth Neel ) వరుస సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ఈ డైరెక్టర్ డైరెక్షన్ లో నటించడానికి చాలామంది స్టార్ హీరోలు ఆసక్తి చూపుతున్నారు.

ప్రశాంత్ నీల్ భవిష్యత్తు నాలుగు సినిమాలకు సంబంధించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుండటం గమనార్హం.ప్రశాంత్ నీల్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) సినిమాతో బిజీగా ఉన్నారు.

ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయింది.తారక్ ఈ సినిమాకు బల్క్ డేట్లు కేటాయించారని సమాచారం అందుతోంది.2026 సంవత్సరం జనవరి నెల 9వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ సలార్2( Salaar 2 ) పై దృష్టి పెట్టనున్నారు.

సలార్ సీక్వెల్ పై ప్రేక్షకులు ఒకింత ఆసక్తితో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.ఈ రీజన్ వల్లే సలార్2 పై ఆయన ఫోకస్ పెట్టనున్నారు.

Advertisement

సలార్2 మూవీ విడుదలైన తర్వాత ప్రశాంత్ నీల్ కేజీఎఫ్3( KGF 3 ) పై దృష్టి పెట్టనున్నారు.కేజీఎఫ్ ఫ్రాంచైజ్ కు ప్రేక్షకుల్లో ఉన్న డిమాండ్ మామూలు డిమాండ్ కాదు.కేజీఎఫ్3 సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు.యశ్ సైతం కేజీఎఫ్3 సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి ఆసక్తిగా ఎదురుచూస్తుండటం గమనార్హం.

చరణ్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ 2029 సంవత్సరంలో సెట్స్ పైకి వెళ్లనుంది.చరణ్ ప్రశాంత్ కాంబో మూవీకి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది.రామ్ చరణ్ కు ( Ram Charan ) క్రేజ్ మామూలుగా లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

చరణ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.రామ్ చరణ్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లకు మాత్రమే ఓకే చెబుతున్న సంగతి తెలిసిందే.

Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich
Advertisement

తాజా వార్తలు