బాసర సరస్వతి ఆలయంలో ప్రసాదం లడ్డూలకు ఫంగస్..!

నిర్మల్ జిల్లాలోని బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో ప్రసాదం లడ్డూలకు ఫంగస్ ఏర్పడింది.ఆలయ సిబ్బంది నిర్లక్ష్యంగానే అభిషేకం లడ్డూలు పాడయ్యాయని భక్తులు మండిపడుతున్నారు.

వేల సంఖ్యలో లడ్డూలు పాడయ్యాయని తెలుస్తోంది.కాగా ఒక్కో లడ్డూ ధర రూ.100 ఉంది.అయితే లడ్డూలను ఫంగస్ ను శుభ్రం చేసేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.

ఆలయ సిబ్బంది నిర్లక్ష్య ధోరణితోనే అమ్మవారి ఆలయానికి రూ.లక్షల్లో నష్టం వాటిల్లిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అమ్మమ్మ చీర కట్టుకోవాలని ఉంది...ఆ రోజు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను : సాయి పల్లవి
Advertisement

తాజా వార్తలు